హర్మన్ ప్రీత్ కౌర్‌కి ఆసీస్ క్రికెటర్ అరుదైన కానుక
హైదరాబాద్: డెర్బీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీతో భారత్ అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. 115 బంతుల్లో 171 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో హర్మన్ ప్రీత్ కౌర్ కీలకపాత్ర పోషించింది.
అంతేకాదు వరల్డ్ కప్ టోర్నీలో ఓ కీలక ఇన్నింగ్స్ ఆడింది. తద్వారా భారత్ తరుపున వన్డేల్లో అత్యధిక స్కోరు చేసిన రెండో బ్యాట్స్ ఉమెన్‌గా దీప్తిశర్మ(188 నాటౌట్) తర్వాత కౌర్ నిలిచింది. వరల్డ్ కప్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌కి మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా ప్లేయర్ తన జెర్సీని కానుకగా అందజేసింది.

42 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసిన భారత్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 42 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. హర్మన్ ఆస్ట్రేలియా బౌలర్లను చీల్చి చెండాడింది. ఆకాశమే హద్దుగా చెలరేగి 115 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 171 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.

40.1 ఓవర్లలో 245 పరుగులకే ఆసీస్ ఆలౌట్
282 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 40.1 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌పై భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించి పైనల్లోకి ప్రవేశించింది. అయితే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో అలెక్స్ బ్లాక్‌వెల్ 56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 90 పరుగులు చేసింది.

బ్లాక్‌వెల్ అవుట్‌తో భారత్ విజయం ఖాయం
అంతేకాదు ఒకానొక సమయంలో భారత్ బౌలర్లకు చెమటలు పట్టించింది. 41వ ఓవర్లో దీప్తిశర్మ వేసిన బంతికి బ్లాక్‌వెల్(90) బౌల్డ్ అయింది. దీంతో భారత్ విజయం ఖాయమైంది. మరోవైపు హర్మన్, బ్లాక్‌వెల్ మంచి స్నేహితులు. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో సిడ్నీ థండర్స్‌కి బ్లాక్‌వెల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది.
బీబీఎల్‌తో ఇద్దరి మధ్య స్నేహం
ఇదే జట్టులో హర్మన్ కూడా ఆడుతోంది. దీంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. దీంతో మ్యాచ్ అనంతరం బ్లాక్‌వెల్ తన జెర్సీని హర్మన్‌కి బహుకరించింది. కీలక మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన హర్మన్‌ను ఈ సందర్భంగా బ్లాక్‌వెల్ అభినందించింది. బిగ్‌బాష్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారత క్రికెటర్‌గా కూడా కౌర్ నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications