Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉమెన్ వరల్డ్ కప్: అరుదైన ఘనత సాధించిన మిథాలీ సేన

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. శనివారం తొలి మ్యాచ్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్పై 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ క్రమంలో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్‌పై విజయంతో పాటు అరుదైన ఘనతను సాధించింది. మహిళల క్రికెట్‌లో అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్)ను ప్రవేశపెట్టిన తర్వాత దానిని ఉపయోగించిన తొలి జట్టుగా భారత మహిళల జట్టు రికార్డు సాధించింది.

ICC Women's World Cup 2017: Mithali Raj & Co script history, become first team to successfully use DRS

ఈ విషయాన్ని ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్ సన్ సోషల్ మీడియా ద్వారా అధికారికగా వెల్లడించారు. మహిళల క్రికెట్‌లో డీఆర్ఎస్‌ను వినియోగించిన మొదటి జట్టుగా భారత మహిళల జట్టు నిలిచిందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా భారత బౌలర్ దీప్తిశర్మ వేసిన 18ఓవర్ తొలి బంతిని ఇంగ్లాండ్ బ్యాట్స్ ఉమన్ నాటలీ స్క్రివర్ స్వీప్ షాట్ ఆడేందుకు యత్నించింది. అది ఆమె గ్లోవ్స్‌ను తాకి భారత వికెట్ కీపర్ సుష్మా వర్మ చేతుల్లో పడింది. దీనిపై అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ తిరస్కరించారు.

దాంతో భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ డీఆర్ఎస్‌ను ఆశ్రయించగా అది విజయం వంతం అయింది. తద్వారా మహిళల క్రికెట్‌లో డీఆర్ఎస్‌ను తొలిసారి వినియోగించుకోవడమే కాకుండా, విజయవంతం అయిన తొలి జట్టుగా కూడా భారత్ గుర్తింపు సాధించింది.

ఇదిలా ఉంటే శనివారం జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌పై 35 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓపెనర్‌ స్మృతి మంధన (90), పూనమ్‌ రౌత్‌ (86), కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (71) అర్ధసెంచరీలతో రాణించారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 281 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ 47.3 ఓవర్లలో 246 పరుగుల వద్ద ఆలౌటైంది. స్మృతి మంధనకు 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది. భారత్‌ తన తదుపరి మ్యాచ్‌ని ఈనెల 29న వెస్టిండీస్‌తో ఆడనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+