హైదరాబాద్: ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌లో భారత మహిళా ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధన (63) చక్కటి శుభారంభాన్నిచ్చింది.
గాయం కారణంగా ఆర్నెల్లు జట్టుకు దూరమైన ఆమె ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఆరంభ పోరులో అర్ధ సెంచరీని సాధించింది. దీంతో ఉమెన్ వరల్డ్ కప్‌లో తొలి అర్ధ సెంచరీ సాధించిన అరుదైన గుర్తింపు సాధించింది. ఆది నుంచి దూకుడుగా ఆడుతున్న మంధన 45 బంతుల్లోనే అర్ధసెంచరీని సాధించింది.
48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గన్ వేసిన 16వ ఓవర్ చివరి బంతికి బౌండరీతో అర్ధ సెంచరీ చేసింది. ఈ వరల్డ్ కప్ టోర్నీలో తొలి అర్ధ సెంచరీ, తొలి సిక్సర్ కూడా ఆమెదే కావడం విశేషం. షివెర్ వేసిన 5.1వ బంతిని లాంగాన్‌లో భారీ సిక్సర్‌గా మలిచింది. మరో ఓపెనర్ పూనమ్ రౌత్ (31) ఆమెకు సహకరిస్తుంది.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్
ఇంగ్లాండ్ వేదికగా శనివారం నుంచి 11వ ఉమెన్ వరల్డ్ కప్ ప్రారంభమైంది. టీమిండియా తన తొలి మ్యాచ్‌లో శనివారం ఆతిథ్య ఇంగ్లాండ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుని టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
ఈ మధ్య కాలంలో భారత మహిళల జట్టు ఆడిన 17 మ్యాచ్‌ల్లో 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. తద్వారా నాలుగు వన్డే సిరీస్‌లను కైసవం చేసుకుంది. ఈ క్రమంలో ఈ టోర్నీలో మిథాలీ రాజ్ కెప్టెన్‌గా భారత మహిళల జట్టు అండర్ డాగ్‌గా బరిలో దిగుతోంది.
1978 నుంచి ఇప్పటి వరకు భారత్‌తో ఇంగ్లాండ్ తొమ్మిది మ్యాచ్‌లు ఆడగా, ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. సొంత గడ్డపై జట్టుకు నాలుగో టైటిల్ అందించాని జట్టు కెప్టెన్ నైట్ ఆశిస్తోంది. ఇంగ్లాండ్‌పై గెలుపుతో బోణి కొట్టాలని మిథాలీరాజ్ సేన ఉవ్విళూరుతోంది.
జూన్ 24 నుంచి జూలై 23 వరకు జరిగే ఈ వరల్డ్ కప్‌లో టాప్-8 దేశాలు టోర్నీ తలపడతాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్దతిలో సాగే ఈ టోర్నీల్లో ప్రతి జట్టు మిగిలిన ఏడు దేశాలతో మ్యాచ్‌లను ఆడుతుంది. ఈ టోర్నీలో టైటిల్ ఫేవరేట్‌లుగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు బరిలో దిగుతున్నాయి.
ఇక భారత్, ఇంగ్లండ్ జట్లు 61 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 25 మ్యాచ్‌ల్లో భారత్... 34 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచాయి. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు తొమ్మిది సార్లు ముఖాముఖి తలపడగా... మూడుసార్లు భారత్, ఆరుసార్లు ఇంగ్లండ్ విజయం సాధించాయి.
జట్ల వివరాలు:
టీమిండియా:
ఇంగ్లాండ్: