Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

10 ఆసక్తికర విషయాలు: లార్డ్స్‌లో ఇండియా-ఇంగ్లాండ్ వరల్డ్ కప్ ఫైనల్

హైదరాబాద్: ప్రపంచ మహిళా క్రికెట్‌లో చరిత్ర సృష్టించేందుకు మిథాలీ సేన అడుగు దూరంలో నిలిచింది. ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌ ఫైనల్లో భారత్-ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఆదివారం జరిగే ఈ పైనల్స్‌కు లార్డ్స్ వేదిక అవుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

భారత్ వరల్డ్ కప్ పైనల్‌కు చేరడం ఇది రెండోసారి. 2005లో ఇదే మిథాలీ రాజ్ నేతృత్వంలో వరల్డ్ కప్ ఫైనల్‌కు తొలిసారి చేరుకుంది. అయితే ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. ఇన్నాళ్లకు మళ్లీ వరల్డ్ ఫైనల్‌కి చేరుకున్న భారత మహిళల జట్టు ఈసారి వరల్డ్ కప్‌ను కైవసం చేసుకోవాలనే కృత నిశ్చయంతో ఉంది.

 ICC Women's World Cup 2017: 10 facts about India-England Final

ఇండియా Vs ఇంగ్లాండ్ ఫైనల్ మ్యాచ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు:

* ఇండియా వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. గతంలో 2005లో తొలిసారి వరల్డ్ కప్ పైనల్‌కు చేరినప్పటికీ ఆసీస్ చేతిలో ఓడిపోయింది.
* 2017 ఉమెన్ వరల్డ్ కప్‌కి ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోంది. 1973, 1993లో అతిథ్యమిచ్చిన రెండు సార్లు విజేతగా నిలిచింది.
* ఫైనల్లో భారత్ విజయం సాధిస్తే వరల్డ్ కప్ సాధించిన నాలుగో దేశంగా అవతరిస్తుంది. ఇప్పటివరకు 10 సార్లు ఐసీసీ వరల్డ్ కప్ జరిగితే ఆస్ట్రేలియా ఆరు సార్లు గెలవగా, ఇంగ్లాండ్ మూడు సార్లు, న్యూజిలాండ్ ఒకసారి విజేతగా నిలిచాయి.
* ఇంగ్లాండ్ చివరిసారిగా ఆడిన రెండు వరల్డ్ కప్ ఫైనల్స్‌లో విజయం సాధించింది.
* 2017లో టీమిండియా ఆడిన 19 వన్డే మ్యాచ్‌ల్లో 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఈ టోర్నీకి అర్హత సాధించింది.
* లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇరు జట్లు గతంలో రెండు సార్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో సారి గెలిచాయి. ఒక మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది.
* చివరి నాలుగు వరల్డ్ ఫైనల్స్‌లో తొలుత బ్యాటింగ్ జట్టే గెలిచింది.
* వన్డేల్లో ఇంగ్లాండ్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా మిథాలీ రాజ్ నిలిచింది. 20కి పైగా ఆడిన ఇన్నింగ్స్‌లో మిథాలీ రాజ్ 48.6 యావరేజితో 1,605 పరుగులు చేసింది.
* ఉమెన్ వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ప్లేయర్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ నిలిచింది. గురువారం ఆసీస్‌తో జరిగిన సెమీ ఫైనల్లో కౌర్ 171 పరుగులతో ఆజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే.
* 2017 ఉమెన్ వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ తరుపున ఎక్కువ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నటాలియా నిలిచింది.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+