For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి: 'మ్యాచ్‌ తర్వాత ఏడ్చేశాం'

వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి అనంతరం జట్టు సభ్యులందరం ఏడ్చేశామని భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పేర్కొంది. టోర్నీ ఆద్యంతం భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసింది.

By Nageshwara Rao

హైదరాబాద్: వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి అనంతరం జట్టు సభ్యులందరం ఏడ్చేశామని భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పేర్కొంది. టోర్నీ ఆద్యంతం భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. చివరి వరకూ అద్భుత ప్రదర్శన చేసిన మిథాలీ సేన చివర్లో ఒత్తిడికి లోనై గెలుపు ముంగిట బోల్తా పడింది.

లార్డ్స్ వేదికగా ఆదివారం ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 9 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. విజయానికి దగ్గరగా వచ్చి చివర్లో ఓటమి పాలవడంతో సగటు భారత క్రికెట్ అభిమానితో పాటు మ్యాచ్ ఆడి ఓడిన మహిళా క్రికెటర్లను సైతం తీవ్రంగా కలచివేసింది.

మ్యాచ్ ముగిసిన తర్వాత అందరం ఏడ్చేశాం

మ్యాచ్ ముగిసిన తర్వాత అందరం ఏడ్చేశాం

మ్యాచ్ ముగిసిన తర్వాత తమ జట్టు సభ్యులందరం ఏడ్చేశామని ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్మన్ ప్రీత్ చెప్పింది. ‘మహిళల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ చేతిలో 9 పరుగుల తేడాతో ఓడిపోయాం. విజయానికి అతి చేరువగా వచ్చి ఓటమి పాలయ్యాం. ఇది జట్టు మొత్తాన్ని కలచివేసింది. అందరం ఏడ్చేశాం. మ్యాచ్‌ గురించి అందరం చర్చించుకున్నాం' అని తెలిపింది.

మమ్ముల్ని ఏడవవద్దని చెప్పారు

మమ్ముల్ని ఏడవవద్దని చెప్పారు

‘జట్టు సహాయక సిబ్బంది మమ్ముల్ని ఏడవవద్దని చెబుతూనే ఉన్నారు. కానీ మేము మా బాధను ఆపుకోలేకపోయాం. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం అనంతరం బస చేసిన హోటల్‌కు బయలుదేరాం. హోటల్‌కి చేరుకునే సమయంలో మరోసారి సిబ్బంది స్పోర్టివ్గా ఉండాలని చెప్పారు' అని హర్మన్ చెప్పింది.

హోటల్‌కు చేరుకున్నాక ఓటమిని మరిచిపోయాం

హోటల్‌కు చేరుకున్నాక ఓటమిని మరిచిపోయాం

హోటల్‌కు చేరుకున్న తర్వాత మేమంతా ఓటమిని మరిచిపోయి మా ప్రదర్శనను సెలబ్రెట్ చేసుకుంటూ డిన్నర్ చేశాం. నా జట్టుని చూసి ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్‌ చేరి నాకు మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది. అంతేకాదు ఈ టోర్నీలో మేము మంచి క్రికెట్ ఆడాం. ఇది మహిళా క్రికెట్ కు మంచి పరిణామం' అని పేర్కొంది.

ఫైనల్లో ఓటమి గతంలో మేము చూసిన ఓటముల్లో ఒకటి

ఫైనల్లో ఓటమి గతంలో మేము చూసిన ఓటముల్లో ఒకటి

'ఫైనల్లో ఓటమి గతంలో మేము చూసిన ఓటముల్లో ఒకటి. గెలవాలనుకున్నాం.. కానీ పోరాడి ఓడిపోవడాన్ని కూడా ఆస్వాదిస్తున్నాం. ఇక గతం మర్చిపోయి విజయాల కోసం పోరాడుతూ ముందుకు దూసుకెళ్లాలి' అని హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది. ఈ టోర్నీలో కౌర్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ (115 బంతుల్లో 171 నాటౌట్) ఆడిన సంగతి తెలిసిందే.

ఫైనల్లో కౌర్ 51 పరుగులు చేసిన హర్మన్ ప్రీత్ కౌర్

ఫైనల్లో కౌర్ 51 పరుగులు చేసిన హర్మన్ ప్రీత్ కౌర్

ఫైనల్లో కౌర్ 51 పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే. 'ఏ సిటీ ఆడుతున్నామో ముఖ్యం కాదు. క్రికెట్‌ ఆడటం నా కల. ఆ కలతోనే మన జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాలి. మహిళా క్రికెట్‌ పట్ల ఇప్పుడిప్పుడే మన దేశంలో అవగాహన పెరుగుతోంది. రాబోయే రోజుల్లో మరింతగా ఆత్మవిశ్వాసం పెంచి క్రికెట్‌ ఆడేలా చేయండి' అని హర్మన్‌ ఈ సందర్భంగా కోరింది.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+