న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ర్యాంకులు: టాప్-10లో నలుగురు, మూడో స్థానంలో హర్మన్

Harmanpreet Kaur Climbs To Third Place In ICC Women’s T20I Rankings | Oneindia Telugu
ICC Women’s T20I Rankings: Harmanpreet Kaur climbs to third after World T20

హైదరాబాద్: మహిళల టీ20 ర్యాంకుల్లో భారత మహిళల హవా కొనసాగుతోంది. మంగళవారం ప్రకటించిన ఐసీసీ మహిళల టీ20 ర్యాంకుల్లో భారత మహిళల టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి మూడో స్థానంలో నిలిచింది.

ఫోర్బ్స్ జాబితా: ఆదాయం సంపాదనలో ధోని రికార్డుకి చేరువలో కోహ్లీ!ఫోర్బ్స్ జాబితా: ఆదాయం సంపాదనలో ధోని రికార్డుకి చేరువలో కోహ్లీ!

ఇటీవల వెస్టిండీస్‌లో ముగిసిన వరల్డ్ టీ20లో హర్మన్‌ప్రీత్ కౌర్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌ఉమెన్‌గా నిలిచింది. టాప్-10లో భారత్‌కు చెందిన నలుగురు మహిళా క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. యువ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ తొమ్మిది స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచింది.

జెమీమా రోడ్రిగ్స్‌కు ఇదే కెరీర్ బెస్ట్ ర్యాంకు కావడం విశేషం. ఇక, ఓపెనర్ స్మృతి మంధాన ఏడు స్థానాలు ఎగబాకి టాప్-10లో నిలిచింది. మంధానకు ఇదే కెరీర్ బెస్ట్ ర్యాంకు. బౌలర్ల జాబితాలో పూనమ్ యాదవ్, అనుజా పాటిల్ మాత్రమే టాప్-20లో చోటు దక్కించుకున్నారు.

టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సుజీ బేట్స్(న్యూజిలాండ్) అగ్రస్థానంలో కొనసాగుతుండగా స్టెఫానీ టేలర్(విండీస్) రెండో స్థానంలో కొనసాగుతుండగా, భారత్‌కు చెందిన హర్మన్‌ప్రీత్ కౌర్ మూడో స్థానంలో కొనసాగుతోంది.

టీ20ల్లో బ్యాట్స్‌ ఉమన్ ర్యాంకులు:
1. Suzie Bates (New Zealand) - 694 points
2. Stefanie Taylor (Windies) - 656 points
3. Harmanpreet Kaur (India) - 632 points
4. Meg Lanning (Australia) - 623 points
5. Deandra Dottin (Windies) - 614 points
6. Jemimah Rodrigues (India) - 607 points
7. Beth Mooney (Australia) - 601 points
8. Alyssa Healy (Australia) - 575 points
9. Mithali Raj (India) - 570 points
10. Smriti Mandhana (India) - 567 points

టీ20ల్లో బౌలర్ల ర్యాంకులు:
1. Megan Schutt (Australia) - 728 points
2. Poonam Yadav (India) - 662 points
3. Leigh Kasperek (New Zealand) - 647 points
4. Sophie Ecclestone (England) - 643 points
5. Ellyse Perry (Australia) - 641 points
6. Anya Shrubsole (England) - 638 points
7. Amelia Kerr (New Zealand) - 612 points
8. D. Kimmince (Australia) - 606 points
9. Nida Dar (Pakistan) - 596 points
10. Shabnim Ismail (South Africa) - 587 points

టీ20 ర్యాంకులు:
1. Australia - 283 points
2. England - 274 points
3. New Zealand - 273 points
4. Windies - 265 points
5. India - 256 points
6. South Africa - 242 points
7. Pakistan - 225 points
8. Sri Lanka - 208 points
9. Bangladesh - 191 points
10. Ireland - 185 points

Story first published: Tuesday, November 27, 2018, 16:55 [IST]
Other articles published on Nov 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X