ICC Women's T20 World Cup: గురువారం నుంచి టికెట్ల అమ్మకం

హైదరాబాద్: గురువారం నుంచే మహిళల టీ20 టిక్కెట్ల అమ్మకం మొదలు కానున్నాయి. సరిగ్గా సంవత్సరం తర్వాత ఆస్ట్రేలియా వేదికగా జరిగే మ్యాచ్‌లకు ఇప్పటి నుంచే టిక్కెట్ల అమ్మకం ప్రారంభం కానున్నాయి. ఈ వరల్డ్ కప్ ఈవెంట్ ఫిబ్రవరి 21 నుంచి మర్చి 8 వరకు జరగనుంది.
మొదటి మ్యాచ్ సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మ్యాచ్ జరగనున్నది. ఫైనల్ మ్యాచ్ మార్చి 8, 2020 ఉమెన్స్ డే నాడు జరగడం గమన్హారం. అన్ని మ్యాచ్‌లు ఆస్ట్రేలియా లోని ఆరు ప్రదేశాల్లో జరగునున్నాయి. ప్రపంచంలోనే పది ఉత్తమ జట్లు పాల్గొనబోతున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్‌లు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు బ్రిస్బేన్ వేదికగా జరగనున్నాయి.
ఈ మ్యాచ్ లను చూసేందుకు పెద్దలకు ఫీజు 10 డాలర్స్ , పిల్లలు ఉచితంగా తిలకించవచ్చు. టోర్నీలో అన్ని మ్యాచ్ లు 20 డాలర్స ఫీజుతో మొదలు కానున్నాయి ఫైనల్ మ్యాచ్ కు కూడా ఇదే ఫీజు వర్తిస్తుంది. అయితే పిల్లలకు మాత్రం 5 డాలర్స్.
ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ మాట్లాడుతూ "ఒక సంవత్సరం ముందే ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ టికెట్స్ అమ్మకం మొదలు కావడం పట్ల ఆనందంగా ఉంది, ఫైనల్ మ్యాచ్ ఎంసీజీ లో 92,000 అభిమానుల మధ్య జరగుతుండటం తో చాలా ఆసక్తికరంగా ఉన్నాను " అని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications