ICC Women's T20 World Cup: క్రికెటర్లకు పండుగే, 320 శాతం పెరిగిన ఫ్రైజ్ మనీ

హైదరాబాద్: ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌కప్ విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) భారీగా పెంచింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు జరిగే ఈ టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళల టీ20 వరల్డ్‌కప్ విజేతకు రూ. 7.16 కోట్ల ప్రైజ్ మనీని ఐసీసీ నిర్ధారించింది.

ఐదింతలు పెరిగిన ప్రైజ్ మనీ
మరోవైపు రెండో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 3.5 కోట్లుగా నిర్ధారించింది. 2018తో పోలిస్తే ప్రైజ్ మనీ ఐదింతలు పెరిగింది. అంతేకాదు 2018 టీ20 వరల్డ్‌కప్‌తో పోలిస్తే ప్రైజ్ మనీ 320 శాతం పెరగడం విశేషం. ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొనున్నాయి. వరల్డ్ కప్‌లో పాల్గొనబోయే మహిళా జట్లను గ్రూప్ ఏ, గ్రూప్ బీలుగా విభజించింది.

ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్
మహిళల టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించి గ్రూప్ ఏలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా, శ్రీలంక జట్లు ఉండగా... గ్రూప్ బీలో ఇంగ్లండ్, వెస్టిండిస్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్లు ఉన్నాయి. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు జరగనుండగా.. భారత మహిళల క్రికెట్ జట్టు తన తొలి మ్యాచ్‌ను డిపెండింగ్ చాంపియన్ ఆసీస్‌తో ఆడనుంది.

మార్చి 8న ఫైనల్స్
మార్చి 5న సెమీఫైనల్స్, మార్చి 8న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమిస్తోంది. మరోవైపు మహిళల 50 ఓవర్ల వరల్డ్‌కప్‌లో కూడా ప్రైజ్ మనీని భారీగా పెంచడం జరిగింది. 2017 విజేతకు రూ.1432 కోట్లు ఇచ్చిన ఐసీసీ 2021లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో ప్రైజ్ మనీని రూ.25.07 కోట్లకు పెంచింది.

అండర్-19 విభాగంలో కూడా మహిళల టీ20 వరల్డ్‌కప్
ఇక, అండర్-19 విభాగంలో కూడా మహిళల టీ20 వరల్డ్‌కప్‌ను నిర్వహించేందుకు ఐసీసీ అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా 2021లో జరగనున్న అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్ తొలి ఎడిషన్‌కు బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తోంది. ఇకపై భవిష్యత్తులో ఈ వరల్డ్‌కప్‌ను ప్రతి రెండేళ్లకొకసారి ఐసీసీ నిర్వహించనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications