Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్‌ చరిత్రలోనే అరుదైన దృశ్యం.. రికార్డు బద్దలు కొట్టిన మహిళల ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్!!

ICC Women’s T20 World Cup: 86,174 fans turn up at MCG, create record in womens cricket

మెల్‌బోర్న్‌: ఎన్నో ఆశలతో టీ20 ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత మహిళల జట్టు చివరి మెట్టుపై బోల్తా పడింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో అజేయంగా ఫైనల్‌కు చేరిన భారత జట్టు ఆదివారం ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగిన ఫైనల్లో 85 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా ఐదోసారి కప్పును ముద్దాడింది. ఓపెనర్లు ఎలీసా హేలీ (39 బంతుల్లో 75; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), బెత్‌ మూనీ (54 బంతుల్లో 78 నాటౌట్‌; 10 ఫోర్లు) ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

 ఎంసీజీకి 86,174 మంది ప్రేక్షకులు:

ఎంసీజీకి 86,174 మంది ప్రేక్షకులు:

మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ప్రపంచకప్‌ ఫైనల్ సందర్భంగా ఏకంగా 86,174 మంది ప్రేక్షకులు ఎంసీజీకి తరలివచ్చారు. దీంతో అత్యధిక వీక్షకులు వచ్చిన మహిళల క్రికెట్‌ మ్యాచ్‌గా భారత్‌-ఆస్ట్రేలియా ఫైనల్‌ మ్యాచ్‌ రికార్డుల్లోకి ఎక్కింది. ఇక ఆసీస్‌లో జరిగిన ఓ మహిళల ఈవెంట్స్‌కు అత్యధిక వీక్షకులు హాజరైన పోటీ కూడా ఇదే.

73 వేల మంది అధికం:

73 వేల మంది అధికం:

అత్యధిక ప్రేక్షకులు (వీక్షకులు ) హాజరైన ప్రపంచకప్‌ ఫైనల్‌ రికార్డు ఇంగ్లాండ్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ పేరిట ఉండేది. 2009లో జరిగిన ఈ ఫైనల్‌కు 12,717 మంది హాజరయ్యారు. ఇంగ్లాండ్‌-కివీస్‌ ఫైనల్‌ కంటే భారత్‌-ఆసీస్‌కు ఫైనల్‌కు వచ్చిన ప్రేక్షకుల సంఖ్య దాదాపు 73 వేలు అధికం కావడం ఇక్కడ విశేషం. మ్యాచ్ జరుగుతుండగా ఎంసీజీలో మహిళలు తమ మార్క్ చూశపించారు. క్రీడాకారులను మ్యాచ్ ఆసాంతం ప్రోత్సహించారు.

ఎప్పుడూ ఊహించలేదు:

ఎప్పుడూ ఊహించలేదు:

'ఇంతమంది ప్రేక్షకుల మధ్యలో క్రికెట్‌ ఆడతానని ఎప్పుడూ ఊహించలేదు. చాలా ఆనందంగా ఉంది. ఇది ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడకి వచ్చిన ప్రతివారికి నా కృతజ్ఞతలు' అని ఆస్ట్రేలియా క్రికెటర్ ఆష్లీ గాడ్నర్‌ పేర్కొంది. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రపంచకప్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సన్నివేశం చూస్తే.. భవిష్యత్తులో పురుషుల ఆటకు ధీటుగా మహిళల ఆటకు వీక్షకులు రానున్నారు.

వెక్కివెక్కి ఏడ్చిన షెఫాలీ:

వెక్కివెక్కి ఏడ్చిన షెఫాలీ:

లీగ్‌ దశలో బ్యాటింగ్‌ భారాన్ని మోసిన యువ సంచలనం షఫాలీ వర్మ తుది పోరులో చేతులెత్తేసింది. తొలి ఓవర్‌లోనే ఊహించని విధంగా ఔట్ అయి పెవిలియన్ చేరింది. ఓటమి తర్వాత షెఫాలీ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, సహచర క్రికెటర్లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ వెక్కివెక్కి ఏడ్వసాగింది. ప్రస్తుతం షఫాలీ కన్నీరు పెట్టుకున్న ఫోటోలు, సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఆమెకు బాసటగా నిలిచారు.

Story first published: Monday, March 9, 2020, 9:28 [IST]
Other articles published on Mar 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+