Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మరోసారి మెరిసిన షెఫాలీ.. కివీస్ ముందు స్వల్ప లక్ష్యం!!

ICC Women’s T20 World Cup 2020: Shikha Pandey strikes early after India post 133


మెల్‌బోర్న్‌:
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జంక్షన్ ఓవెల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ (46; 34 బంతుల్లో 4x4, 3x6) ధాటిగా ఆడగా.. తానియా భాటియా (23; 25 బంతుల్లో 3x4) ఫర్వాలేదనిపించింది. బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడంతో మిగతా బ్యాట్స్‌వుమెన్‌ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. కివీస్ బౌలింగ్‌లో రోజ్‌మెరీ మైర్, అమిలియా చెరి చెరో రెండు వికెట్లు తీశారు.

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తహుహు వేసిన మూడో ఓవర్‌లో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఓవర్ రెండో బంతికి ఓపెనర్‌ స్మృతి మంధాన (11) క్లీన్ బౌల్డ్ అయింది. దీంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్ 1 వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. ఆ తర్వాత 9వ ఓవర్‌లో తనియా భాటియా(23) అమిలియా కెర్ర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.

ఇక సంచలన బ్యాట్స్‌వుమెన్‌ షెఫాలీ వర్మ తనకు రెండు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయింది. 25,32 పరుగుల వద్ద రెండు జీవనాధారాలు లభించాయి. కానీ భారీ స్కోర్‌ చేయడంలో విఫలమై 46 పరుగులకే వెనుదిరిగింది. హయ్‌లీ జెన్‌సెన్‌ బౌలింగ్‌లో షెఫాలీ 25 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను మాడీ గ్రీన్‌ జారవిడవగా.. 32 పరుగుల వద్ద రోజ్‌మెరీ మెయిర్‌ బౌలింగ్‌లో మరో లైఫ్‌ లభించింది. వరుసగా వికెట్లు పడుతుండటంతో షెఫాలీపై అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే అప్పటికీ పలు నిర్లక్ష్యపు షాట్‌లు ఆడిన షెఫాలీ.. అమెలియా కెర్‌ బౌలింగ్‌లో అనవసరపు భారీ షాట్‌ ఆడి క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరి

కివీస్ బౌలర్ల ధాటికి కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (1), జెమిమా రోడ్రిగ్స్‌ (10), దీప్తి శర్మ (8), వేదా కృష్ణమూర్తి (6) పూర్తిగా విఫలమయ్యారు. చివర్లో శిఖ పాండే (10), రాధా యాదవ్‌ (14) నిలవడంతో న్యూజిలాండ్‌ ముందు ఆ మాత్రమైనా స్కోర్‌ ఉంచారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో రోజ్‌మేరీ, అమెలియా కెర్ర్‌ తలో రెండు వికెట్లు తీయగా.. తాహుహు, సోఫీ డివైన్‌, కాస్పెరిక్‌ చెరో వికెట్ తీశారు.

Story first published: Thursday, February 27, 2020, 11:42 [IST]
Other articles published on Feb 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+