Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్.. మంధాన వచ్చేసింది!!

ICC Women’s T20 World Cup 2020: New Zealand Women have won the toss and have opted to field

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న భారత అమ్మాయిలు మరో కీలక పోరుకు సిద్ధమయ్యారు. మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడనుంది. గ్రూప్‌-ఏలో భాగంగా జంక్షన్‌ ఓవెల్‌ మైదానంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కెప్టెన్‌ హీతెర్‌ నైట్‌ బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ఈ మ్యాచ్ కోసం రెండు మార్పులు చేసింది. అరుంధతి రెడ్డి స్థానంలో రాధా యాదవ్, రీచా ఘోష్ స్థానంలో స్మృతి మంధాన వచ్చారు.

టోర్నీ హాట్‌ ఫేవరెట్‌ ఆస్ట్రేలియాను 17 పరుగుల తేడాతో ఓడించి టోర్నీలో శుభారంభం చేసిన భారత మహిళలు.. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 18 పరుగులతో నెగ్గి గ్రూప్‌-ఎలో మొత్తం 4 పాయింట్లతో టాప్‌లో నిలిచారు. ఇక న్యూజిలాండ్‌పై విజయం సాధిస్తే హర్మన్‌ప్రీత్‌ సేన నాకౌట్‌ బెర్త్‌ను ఖరారు చేసుకొంటుంది.

గత రెండు మ్యాచ్‌ల్లో మన అమ్మాయిలు ఇటు బ్యాటింగ్‌లోనూ, అటు బౌలింగ్‌లోనూ అదరగొట్టారు. 16 ఏళ్ల టీనేజ్‌ సంచలనం షఫాలీ వర్మ మెరుపుదాడి, టాపార్డర్‌ బ్యాట్స్‌మన్‌ జెమీమా రోడ్రిగ్స్‌ బాధ్యతాయుత బ్యాటింగ్‌ భారత ఇన్నింగ్స్‌కు బలం అయింది. బౌలింగ్‌లో పూనమ్‌ యాదవ్‌ తన స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతోంది. అయితే కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ నుంచే ఇంకా మెరుపులు రాలేదు.ఈ మ్యాచులో అయినా రాణిస్తుందో చూడాలి.

గతేడాది టీమిండియాతో జరిగిన పొట్టి సిరీస్‌ను న్యూజిలాండ్‌ 3-0తో సొంతం చేసుకున్నది. అయితే 2018 టీ20 ప్రపంచకప్‌లో కివీస్‌ అమ్మాయిలను ఓడించడం భారత్‌కు సానుకూలాంశం. డివైన్‌, సూజీ బేట్స్‌, అమెలియా కెర్‌, లియా తహుహు రూపంలో కివీస్‌ జట్టులో అత్యుత్తమ ప్లేయర్లు ఉన్నారు.

భారత జట్టు: స్మృతి మందాన, షెఫాలి వర్మ, తానియా బాటియా (వికెట్‌ కీపర్‌), జెమీమా రోడ్రిగేజ్‌, హార్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి, శిఖ పాండే, రాధా యాదవ్‌, పూనమ్‌ యాదవ్‌, రాజేశ్వరీ గైక్వాడ్‌.

న్యూజిలాండ్‌ జట్టు: సోఫి డివైన్‌ (కెప్టెన్‌), రేచల్‌ ప్రైస్ట్‌ (వికెట్‌ కీపర్‌), సుజీ బేట్స్‌, మ్యాడీ గ్రీన్‌, క్యాటీ మార్టిన్‌, ఎమేలియా కెర్‌, హైలీ జేన్‌సన్‌, అన్నా పీటర్సన్‌, కాస్పెరెక్‌, లీ తాహుహు, రోస్‌మేరీ మైర్‌.

Story first published: Thursday, February 27, 2020, 9:46 [IST]
Other articles published on Feb 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+