Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహిళల టీ20 ప్రపంచకప్‌.. నేడు బంగ్లాతో భారత్‌ ఢీ.. గెలిస్తే నాకౌట్‌కు!!

ICC Women’s T20 World Cup 2020: India vs Bangladesh Match Preview, Playing XI, Pitch Report
3 Minutes 10 Headlines | Namaste Trump | Women's T20 World Cup 2020 | Oneindia Telugu

పెర్త్‌: టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్‌.. నేడు వాకా మైదానంలో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలో దిగనున్న హర్మన్‌ సేన నాకౌట్‌కు మరింత చేరువ అవ్వడంతో పాటు గత ఆసియా కప్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. గ్రూప్‌-ఏలో ఉన్న మన జట్టు ఈ మ్యాచ్‌లో గెలిస్తే నాకౌట్‌ దశకు దగ్గరైనట్టే. మరో వైపు బంగ్లాదేశ్‌ విశ్వకప్‌లో బోణీ కొట్టాలని తహతహలాడుతున్నది.

స్మృతి, హర్మన్‌ చెలరేగితే:

స్మృతి, హర్మన్‌ చెలరేగితే:

ఆస్ట్రేలియాపై కేవలం 132 పరుగులే చేయడం భారత బ్యాటింగ్‌ బలహీనతను తెలియజేసింది. టాపార్డర్‌లో షెఫాలీ వర్మ దూకుడుగా ఆడగా.. చివర్లో దీప్తి శర్మ నిలువడంతో టీమిండియా ఓ మోస్తరు స్కోరు చేసింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ ప్రీత్, దీప్తి శర్మలతో భారత బ్యాటింగ్‌ పటిష్టంగా కనిపిస్తున్నా.. గత కొంతకాలంగా స్మృతి మాత్రమే నిలకడ చూపుతోంది. ఫినిషర్‌గా పేరున్న హర్మన్‌ప్రీత్‌ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. దీప్తి నిలకడ ప్రదర్శిస్తున్నా వికెట్ల మధ్య పరుగెత్తడంలో మరింత చురుకుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఫామ్‌లోనే ఉన్న స్టార్‌ ఓపెనర్‌ స్మృతి సహా కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ చెలరేగితే టీమిండియాకు తిరుగుండదు.

పాండే, పూనమ్‌ కీలకం:

పాండే, పూనమ్‌ కీలకం:

ప్రపంచంలోనే బౌన్సీ వికెట్‌గా పిలువబడే వాకా మైదానంలో మ్యాచ్‌ జరుగుతుండటంతో పేసర్‌ శిఖా పాండే మరోసారి కీలకం కానుంది. పాండేతో పాటు పూనమ్‌ యాదవ్‌ మరోసారి చెలరేగితే భారత్‌కు విజయం అంత కష్టమేమీ కాదు. గత మ్యాచ్‌లో పూనమ్‌ దుమ్మరేపగా.. పాండే రాణించింది. తెలుగుమ్మాయి అరుంధతీ రెడ్డి భారీగా పరుగులిచ్చుకోవడం జట్టును ఇబ్బంది పెడుతున్నది. మరో స్పిన్నర్‌ దీప్తి పొదుపైన బౌలింగ్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉంది.

అనుభవజ్ఞులతో బంగ్లాదేశ్‌:

అనుభవజ్ఞులతో బంగ్లాదేశ్‌:

కెప్టెన్‌ సల్మా ఖాతున్‌, ఆల్‌రౌండర్‌ జొహనర ఆలం, టాపార్డర్‌ బ్యాట్స్‌వుమెన్‌ ఫర్గాన హక్‌ లాంటి అనుభవజ్ఞులతో బంగ్లాదేశ్‌ జట్టు కూడా బలంగానే ఉంది. బంగ్లా ఆశలన్నీ ఆలం, హక్‌పైనే ఆధారపడ్డాయి. 26 ఏళ్ల హక్‌ టీ20ల్లో సెంచరీ చేసిన ఘనత కలిగి ఉంది. 2018 ఆసియా కప్‌ టీ20 గ్రూపు దశలో భారత్‌పై బంగ్లా విజయాల్లో హక్‌ ప్రధానపాత్ర పోషించింది. గత ఏడాది ఐపీఎల్‌లో భాగంగా జరిగిన టీ20 చాలెంజ్‌ టోర్నీలో మిథాలీ రాజ్‌ సారథ్యంలో ఆడిన వెలాసిటీ జట్టులో అలమ్‌ సభ్యురాలు. సల్మా అటు బ్యాటింగ్‌ ఇటు బౌలింగ్‌లో సిద్ధహస్తురాలు.

మరీ ఎక్కువగా పొంగిపోవడం లేదు:

మరీ ఎక్కువగా పొంగిపోవడం లేదు:

'జట్టు చక్కగా ఆడుతోంది. గతంలో మేం ఇద్దరు లేదా ముగ్గురు క్రీడాకారిణులపై ఆధారపడేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. బౌలర్లు మరోసారి మంచి ప్రదర్శన చేస్తారనుకుంటున్నా. మేం మరిన్ని పరుగులు చేయాలి' అని కౌర్‌ పేర్కొంది. 'ఆసీస్‌తో విజయంతో మేం మరీ ఎక్కువగా పొంగిపోవడం లేదు. టోర్నీలో ఇంకా మెరుగ్గా రాణించాల్సి ఉంది. విజయాలను పునరావృతం చేసేందుకు బంగ్లాతో సహా ప్రతీ మ్యాచ్‌లోనూ కష్టపడాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్‌లో మంచి స్కోరు చేసి బౌలర్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా చేయాలి' అని వేద కృష్ణమూర్తి అన్నారు.

4.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం:

4.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం:

ఇప్పటి వరకు భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య 11 టీ20లు జరిగాయి. భారత్‌ తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలిచింది. రెండింటిలో బంగ్లాదేశ్‌ నెగ్గింది. చిన్న జట్టు కదా అని బంగ్లాదేశ్‌ను తేలిగ్గా తీసుకోవడానికి లేదు. కారణం.. 2018 టీ20 ఆసియా కప్‌లో ఆ జట్టు రెండుసార్లు భారత్‌కు షాకిచ్చింది. ఈ రోజు సాయంత్రం గం 4.30లకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్‌ స్పోర్ట్స్‌-2లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

Story first published: Monday, February 24, 2020, 8:20 [IST]
Other articles published on Feb 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+