మహిళల టీ20 ప్రపంచకప్‌ : న్యూజిలాండ్‌తో భారత్ ఢీ.. గెలిస్తే సెమీస్‌కు

మెల్‌బోర్న్‌‌: టీ20 ప్రపంచ‌కప్‌‌లో వరుస విజయాలతో జోరు మీదున్న భారత మహిళల జట్టు మరో సవాల్‌కు సిద్ధమైంది. గురువారం పటిష్ట న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత మహిళలు దాదాపు సెమీస్‌కు చేరుకున్నట్టే. ఆస్ట్రేలియాపై 17, బంగ్లాదేశ్‌పై 18 పరుగుల తేడాతో విజయం సాధించిన హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్‌ ప్రస్తుతం గ్రూప్‌-ఏలో అగ్రస్థానంలో కొనసాగుతుంది.

బ్యాటింగ్‌లో దూకుడు పెంచాలి..

బ్యాటింగ్‌లో దూకుడు పెంచాలి..

తొలి మ్యాచ్‌‌లో ఆసీస్‌‌ను ఓడించినా.. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచినా.. కొన్ని లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఇండియాకు ఎంతైనా ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌‌లో నిలకడలేమితో ఇబ్బందిపడుతున్న టీమిండియా.. భారీ స్కోర్లు చేయలేకపోతోంది. ఓపెనర్లు స్మృతి, షెఫాలీ మెరుపు ఆరంభాన్ని అందిస్తున్నా.. మిడిలార్డర్‌‌ పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌ వైఫల్యం టీమ్‌‌ను వెంటాడుతోంది.

జెమీమా కూడా స్థాయికి తగ్గట్లుగా ఆడలేకపోవడం ప్రతికూలాంశం. ఈ ఇద్దరు షాట్ సెలక్షన్స్‌‌ను మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వైరల్ ఫీవర్‌తో ఓపెనర్‌ స్మృతి మంధాన బంగ్లా మ్యాచులో ఆడలేదు. ఆమె కోలుకోవడంతో జట్టు బ్యాటింగ్ బలం మరింత పెరిగింది. కానీ కెప్టెన్ హర్మన్‌ప్రీతే భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. పటిష్ట బౌలింగ్, బ్యాటింగ్ లైనప్ ఉన్న న్యూజిలాండ్‌ను ఓడించాలంటే సమష్టిగా చెలరేగాల్సిందే. మిడిల్‌‌లో దీప్తి శర్మ మరోసారి ఫామ్‌‌ కొనసాగిస్తే టీమ్‌‌కు తిరుగుండదు.

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ కోల్పోయిన కోహ్లీ.. బుమ్రా, పుజారా కూడా..

 మరోసారి పూనమ్..

మరోసారి పూనమ్..

ఇక బౌలింగ్‌ విభాగంలో మీడియం పేసర్‌‌ శిఖా పాండే, అరుంధతి రెడ్డితో సహా అందరూ మంచి టచ్‌‌లో ఉన్నారు. స్పిన్‌‌లో పూనమ్‌‌ యాదవ్‌‌.. ఇండియాకు పెద్ద దిక్కుగా మారింది. ఆసీస్‌‌, బంగ్లాతో స్వల్ప స్కోరును కాపాడటమే ఇందుకు నిదర్శనం. ఇక భారత్ జట్టులో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. జ్వరం నుంచి కోలుకున్న మంధాన జట్టులోకి వస్తే రిచా ఘోష్ బెంచ్‌కే పరిమితం కానుంది.

ఆ ముగ్గురు కీలకం..

ఆ ముగ్గురు కీలకం..

మహిళల క్రికెట్లో న్యూజిలాండ్‌ బలమైన జట్టు. భారత్‌పై దానికి మెరుగైన రికార్డు ఉంది. ఈ రెండు జట్లు ఆడిన చివరి మూడు టీ20ల్లో ప్రత్యర్థిదే పైచేయి. ఏడాది క్రితం హర్మన్‌సేనను 0-3తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అయితే 2018 టీ20 ప్రపంచకప్‌లో కివీస్‌ను ఓడించడం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. ఆ మ్యాచులో హర్మన్‌‌ప్రీత్ 103 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించింది.

అయితే కెప్టెన్‌, ఆల్‌రౌండర్‌ సోఫీ డివైన్‌, బ్యాటర్‌ సుజీ బేట్స్‌, వికెట్ కీపర్ రాచెల్ ప్రీస్ట్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఈ ముగ్గురిని భారత బౌలర్లు కట్టడి చేయకపోతే భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. బౌలింగ్‌లో కూడా ఆ జట్టు బలంగానే ఉంది. పేసర్‌ లీ తహూహూ, లెగ్‌ స్పిన్నర్‌ అమేలియా కెర్‌ను అడ్డుకుంటేనే భారత్‌కు విజయం సాధ్యం. శ్రీలంకతో తొలి మ్యాచులో డివైన్‌ (55 బంతుల్లో 75) ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించింది.

చహల్, రోహిత్ కోతి వేశాలు.. ఒక తన్ను తన్నిన ఖలీల్ (వైరల్ వీడియో)

పిచ్ పరిస్థితి..

పిచ్ పరిస్థితి..

జంక్షన్ ఓవల్ వేదికగా ఈ మెగాటోర్నీలోనే ఇదే తొలి మ్యాచ్. ఈ వికెట్ తొలుత బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కు దిగవచ్చు. బ్యాట్స్‌మన్ కుదురుకుంటే మాత్రం భారీ స్కోర్లు చేయవచ్చు. వర్షం ముప్పులేదు.

ఎప్పుడంటే..

ఇక ఈ రసవత్తర మ్యాచ్ గురువారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభంకానుంది. స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

జట్లు (అంచనా):

ఇండియా: హర్మన్‌‌ప్రీత్‌‌ (కెప్టెన్‌‌), స్మృతి, షెఫాలీ, జెమీమా, దీప్తి, వేదా కృష్ణమూర్తి, శిఖా పాండే, తానియా, అరుంధతి, పూనమ్‌‌, రాజేశ్వరి గైక్వాడ్‌‌.

న్యూజిలాండ్ : సోఫీ డివైన్(కెప్టెన్), రాచెల్ ప్రీస్ట్ (కీపర్), సుజీ బెట్స్, మ్యాడీ గ్రీన్, పెర్కిన్స్, కటే మార్టిన్, అమెలియ కెర్, జెన్సెన్, లై కస్పెర్క్, లీ తుహూహూ, జెస్ కెర్ర్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Wednesday, February 26, 2020, 17:45 [IST]
Other articles published on Feb 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X