For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ప్రపంచకప్‌: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న బంగ్లా.. మ్యాచ్‌కు మంధాన దూరం!!

ICC Women’s T20 World Cup 2020: Bangladesh Women have won the toss and have opted to field

పెర్త్‌: టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్‌.. వాకా మైదానంలో మరికొద్ది సేపట్లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టాస్ గెలిచి బంగ్లా కెప్టెన్ సల్మా ఖాతున్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. భారత ఓపెనర్ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌కు దూరమైంది. జ్వరంతో బాధపడుతున్న ఆమె స్థానంలో రీచా ఘోశ్‌ జట్టులోకి వచ్చింది.

తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను మట్టికరిపించిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మరో రెండు పాయింట్లు తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఎప్పటిలాగే భారత్‌కు షాక్‌ ఇచ్చి మెగా టోర్నీలో శుభారంభం చేయాలని బంగ్లాదేశ్ తహతహలాడుతోంది. గ్రూప్‌-ఎలో భారత్‌, బంగ్లాతో పాటు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు ఉన్నాయి. వీటిలో టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. ప్రస్తుతం కివీస్, భారత్‌, ఆసీస్‌ తలో రెండు పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఇప్పటి వరకు భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య 11 టీ20లు జరిగాయి. భారత్‌ తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలిచింది. రెండింటిలో బంగ్లాదేశ్‌ నెగ్గింది. చిన్న జట్టు కదా అని బంగ్లాదేశ్‌ను తేలిగ్గా తీసుకోవడానికి లేదు. కారణం.. 2018 టీ20 ఆసియా కప్‌లో ఆ జట్టు రెండు సార్లు భారత్‌కు షాకిచ్చింది. స్టార్‌ స్పోర్ట్స్‌-2లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

జట్లు:
భారత్‌: షెఫాలీ వర్మ, తానియా భాటియా, జెమిమా రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్ (కెప్టెన్)‌, దీప్తి శర్మ, రీచా ఘోశ్‌, వేద కృష్ణమూర్తి, శిఖ పాండే, అరుంధతి రెడ్డి, పూనమ్‌ యాదవ్, రాజేశ్వర్‌ గైక్వాడ్‌.

బంగ్లాదేశ్‌: ముర్షిదా ఖాతున్, షమిమా సుల్తానా, సంజిదా ఇస్లామ్‌, నిగర్‌ సుల్తానా, ఫర్గానా హోక్‌, రుమాన అహ్మద్‌, సల్మా ఖతున్‌ (కెప్టెన్), ఫాహిమా ఖతున్‌, జహానారా ఆలం, పన్నా ఘోశ్‌‌, నహిదా అక్తర్‌.

Story first published: Monday, February 24, 2020, 16:46 [IST]
Other articles published on Feb 24, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+