మహిళల టీ20 ప్రపంచకప్‌కు భారత్‌లో బ్రహ్మరథం.. ఎంతమంది చూశారో తెలుసా?!!

దుబాయ్: ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవల ముగిసిన మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు భారత అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అభిమానుల్లో ఎంతో ఆసక్తి రేపిన ఫైనల్ పోరు వీక్షకుల సంఖ్యలో గత రికార్డులన్నీ బద్దలుకొట్టిందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం ప్రకటించింది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 8న జరిగిన టైటిల్ పోరును భారత్‌లో టీవీలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కలిపి రికార్డు స్థాయిలో 90.2 లక్షల మంది వీక్షించారట.

ప్రపంచకప్ @ 90 లక్షలు:
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 86,174 మంది హాజరవ్వగా.. భారత్‌లో ఈ మ్యాచ్‌ను టీవీల ద్వారా చూసేందుకు 178 కోట్ల నిమిషాల సమయం వెచ్చించినట్లు ఐసీసీ తెలిపింది. ఇక టోర్నీలో హర్మన్‌సేన అదరగొట్టడంతో భారత్‌లో మొత్తంగా 540 కోట్ల నిమిషాల పాటు వీక్షించినట్టు ప్రకటించింది. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వేదికగానూ ఈ టోర్నీ రికార్డు సృష్టించింది. 2019 పురుషుల ప్రపంచకప్ తర్వాత డిజిటల్ వేదికలపై అత్యంత ఆదరణ పొందిన రెండో టోర్నీగా నిలిచింది. ఇక ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు జరిగిన టోర్నీ మ్యాచ్‌ల వీడియోలను వంద కోట్ల మందికి పైగా వీక్షించినట్టు చెప్పింది.

ఎంసీజీకి 86,174 మంది ప్రేక్షకులు:
మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా ఏకంగా 86,174 మంది ప్రేక్షకులు ఎంసీజీకి తరలివచ్చారు. దీంతో అత్యధిక వీక్షకులు వచ్చిన మహిళల క్రికెట్ మ్యాచ్‌గా భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇక ఆసీస్‌లో జరిగిన ఓ మహిళల ఈవెంట్స్‌కు అత్యధిక వీక్షకులు హాజరైన పోటీ కూడా ఇదే.

85 పరుగుల తేడాతో భారత్ ఓటమి:
ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 184 పరుగులు చేసింది. ఓపెనర్లు ఎలీసా హేలీ (39 బంతుల్లో 75; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), బెత్ మూనీ (54 బంతుల్లో 78 నాటౌట్; 10 ఫోర్లు) చితకొట్టారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ (1/30) పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. మరో స్పిన్నర్ దీప్తి శర్మ (2/38) ఫర్వాలేదనిపించింది. అనంతరం లక్ష్య ఛేధనలో భారత్ 19.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. దీప్తి శర్మ (33; 2 ఫోర్లు) టాప్ స్కారర్. ఆసీస్ బౌలర్లలో షుట్ (4/18), జొనాసెన్ (3/20) రాణించారు. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో 85 పరుగుల తేడాతో ఓడి కప్‌ని చేజార్చుకుంది.

హర్మన్‌సేన చెత్త రికార్డు:
మహిళా టీ20 ప్రపంచకప్‌లో హర్మన్‌సేన ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. మెగాటోర్నీలో అత్యధిక క్యాచులు జారవిడిచిన జట్టుగా బంగ్లాదేశ్‌తో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. టోర్నీ మొత్తంలో భారత మహిళలు 9 క్యాచ్‌లు నేలపాలు చేసారు. మరోవైపు బంగ్లాదేశ్ కూడా అన్నే క్యాచ్‌లు జారవిడిచింది. 'క్యాచులే మ్యాచులు గెలిపిస్తాయి' అన్న క్రికెట్ సూత్రాన్ని ఈ రెండు జట్లు మరిచిపోయినట్టున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications