For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డే వరల్డ్ కప్ 2025 షెడ్యూల్ వచ్చేసింది..!

Women's ODI World Cup: భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్న మహిళల వన్డే ప్రపంచ కప్ తేదీలు, వేదికలను ఐసీసీ ప్రకటించింది. ఈ గ్లోబల్ టోర్నమెంట్ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 2న జరగనుంది. ఈ మ్యాచ్‌లు భారత్, శ్రీలంకలోని ఐదు నగరాల్లో జరుగుతాయి. వాటిలో బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం, గౌహతిలోని ఏసీఏ స్టేడియం, ఇండోర్‌లోని హోల్కర్ స్డేడియం, విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం, కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియాలు ఉన్నాయి.

నవంబర్ 2న జరగనున్న ఫైనల్
మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 2న జరగనుంది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 30న బెంగళూరులో జరిగే మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. భారత జట్టు ప్రారంభ మ్యాచ్‌లో ఆడనుంది. ఈ గ్లోబల్ టోర్నమెంట్ 12 ఏళ్ల తర్వాత ఇండియాలో నిర్వహించబడుతోంది. మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 29న గౌహతి లేదా కొలంబోలో జరుగుతుంది. రెండో సెమీ-ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 30న బెంగళూరులో జరుగుతుంది. ఫైనల్‌కు చేరుకునే రెండు జట్లకు సన్నాహాలకు రెండు రోజుల సమయం లభిస్తుంది. మహిళల వన్డే ప్రపంచ కప్ టైటిల్ మ్యాచ్ నవంబర్ 2న బెంగళూరు లేదా కొలంబోలో జరగనుంది.

ICC Women s ODI World Cup 2025 Schedule Venues and Teams

పాల్గొననున్న 8 జట్లు
భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాలకు చెందిన 8 జట్లు మహిళల వన్డే ప్రపంచ కప్‌లో పాల్గొననున్నాయి. ఆస్ట్రేలియా ఈ టోర్నమెంట్‌లోకి డిఫెండింగ్ ఛాంపియన్‌గా ప్రవేశించనుంది. 2022లో న్యూజిలాండ్‌లో జరిగిన చివరి ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఆస్ట్రేలియా ఏడుసార్లు టైటిల్‌ను గెలుచుకుంది. టోర్నమెంట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది.

Story first published: Monday, June 2, 2025, 20:06 [IST]
Other articles published on Jun 2, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+