For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ 20 టోర్నీకి మొట్ట మొదటి సారి ఆతిథ్యమివ్వనున్న ఆస్ట్రేలియా

ICC Women and Men's T20 World Cup schedule announced, Australia will host

హైదరాబాద్: ఐసీసీ టీ 20 షెడ్యూల్‌ని ఖరారు చేసింది. ఐసీసీ టీ 20 పురుషులు, మహిళల విభాగాల్లో జరగనున్న టీ 20 మ్యాచ్‌లకు మొట్ట మొదటి సారి ఆస్ట్రేలియా వేదిక కానుంది. 2020 సంవత్సరం జనవరి 30న జరిగే మ్యాచ్ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టింది. అనంతరం ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు జరగనున్న టీ 20 వేదికలు అడిలైడ్, కాన్‌బెర్రా, మెల్‌బౌర్న్, పెర్త్, సిడ్నీ ఇలా ఉన్నాయి.

ఐసీసీ టీ 20 పురుషుల వరల్డ్ కప్‌కు కూడా వేదికలు అడిలైడ్, బ్రిస్‌బేన్, హోబర్ట్, గీలంగ్, మెల్‌బౌర్న్, పెర్త్, సిడ్నీ ప్రాంతాలే ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కాగా వీరి మ్యాచ్‌లు 2020 అక్టోబరు 18 నుంచి నవంబరు 15వరకు జరగనున్నాయి. ఈ టీ 20 ప్రపంచ కప్ గురించి పూర్తి వివరాలను ఐసీసీ ఇంకొద్ది రోజుల్లో విడుదల చేయనుంది.

మహిళల సెమీ ఫైనల్ మ్యాచ్‌ను సిడ్నీ మైదానంలో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించగా, పురుషుల సెమీ ఫైనల్ మ్యాచ్‌కు అదే మైదానాన్ని సిడ్నీ, అడిలైడ్ వేదికలు కానున్నాయి. ఈ టోర్నీలో మహిళల విభాగంలో పది జట్లు పాల్గొంటుండగా పురుషుల విభాగంలో 16 జట్లు తలపడనున్నాయి.

ఐసీసీ ముఖ్య కార్య నిర్వహణాధికారి అయిన డేవిడ్ రిచర్డ్ సన్ మాట్లాడుతూ. పురుషుల, మహిళల టీ 20 మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తోన్నందుకు ఆస్ట్రేలియా దేశానికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానని అన్నారు. ఈ రెండు గేమ్‌లు ఒకేసారి జరుగుతుండటం ఒక గొప్ప విషయం. అని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రపంచ స్థాయి ఆటలకు వేదికనిచ్చిన తన స్థాయిని పెంచుకుందని కొనియాడారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 30, 2018, 11:00 [IST]
Other articles published on Jan 30, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+