Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్‌కప్‌ను భారత్ నుంచి తరలించుకోవచ్చు: ఐసీసీకి బీసీసీఐ సవాల్!

ICC Welcome To Take T20, ODI World Cup Out Of India For Tax Exemption : BCCI | Oneindia Telugu
ICC Welcome To Take T20, ODI World Cup Out Of India For Tax Exemption: BCCI

హైదరాబాద్: ఐసీసీ షెడ్యూల్ ప్రకారం 2021 టీ20 వరల్డ్‌కప్‌, 2023 వన్డే వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. భారత్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్ల నుంచి పన్ను మినహాయింపు కావాలని అంతర్జాతీయ క్రికెట్‌ సమాఖ్య(ఐసీసీ) కోరుతుంది. ఒక వేళ భారత ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లభించకపోతే బీసీసీఐనే ఆ భారాన్ని మోయాలని గత ఆదివారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఐసీసీ చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

సభ్య దేశాల నుంచి ఐసీసీకి పన్ను మినహాయింపు

సభ్య దేశాల నుంచి ఐసీసీకి పన్ను మినహాయింపు

ఐసీసీ మెగా ఈవెంట్లు నిర్వహించినప్పుడు సభ్య దేశాల నుంచి ఐసీసీకి పన్ను మినహాయింపు లభిస్తోంది. ఇతర క్రికెట్‌ దేశాల్లో ఇస్తున్నట్లుగా భారత క్రికెట్ బోర్డుకు ప్రత్యేకంగా భారత ప్రభుత్వం ఐసీసీ మెగా ఈవెంట్లకు మినహాయింపు ఇవ్వడం లేదు. 2016లో భారత్‌లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో ఐసీసీకి పన్ను మినహాయింపులు లభించలేదు. దీంతో పన్ను మినహాయింపు అదనపు భారాన్ని మోసేందుకు తమ స్పాన్సర్లతో బీసీసీఐ చర్చలు జరుపుకోవాలని ఆదివారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ముందస్తుగా సూచించారు.

ఎంత మాత్రం కుదరదన్న బీసీసీఐ

ఎంత మాత్రం కుదరదన్న బీసీసీఐ

అయితే, ఇది ఎంత మాత్రం కుదరదని బీసీసీఐ స్పష్టం చేసింది. అంతేకాదు కావాలంటే టీ20, వరల్డ్‌కప్‌ ఈవెంట్‌లను నిరభ్యంతరంగా మరో దేశంలో నిర్వహించుకోవచ్చని తేల్చిచెప్పింది. ఈ మేరకు బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ "పన్ను రాయితీలు ప్రభుత్వం చేతుల్లో ఉండే అంశం.. దీనిపై ఎలాంటి బయటి ఒత్తిళ్లు పని చేయవు. ఈ విషయంలో సంబంధిత మంత్రిత్వ శాఖ నిర్ణయానికి మేము కట్టుబడతాం" అని అన్నారు.

వరల్డ్‌కప్ ఇండియాలోనే జరగాలి

వరల్డ్‌కప్ ఇండియాలోనే జరగాలి

"వరల్డ్‌కప్ ఇండియాలోనే జరగాలన్నది మా ఆకాంక్ష. ఒక వేళ ఆ ఈవెంట్లను భారత్‌లో కాకుండా మరో దేశంలో నిర్వహించుకోవాలని ఐసీసీ భావిస్తే, నిస్సందేహంగా నిర్వహించుకోవచ్చు. ఇండియా నుంచి వాళ్లు తరలించాలనుకుంటే వాళ్ల ఇష్టం. టోర్నీ బయటకు వెళ్లిన తర్వాత ఆదాయం పంపిణీ చేస్తే ఎవరు ఎక్కువ నష్టపోయారో ఐసీసీకి తెలుస్తుంది" అని ఆయన అన్నారు.

ఐసీసీ తీసుకున్న అన్ని నిర్ణయాలు అంగీకరించం

ఐసీసీ తీసుకున్న అన్ని నిర్ణయాలు అంగీకరించం

"ఐసీసీ తీసుకున్న నిర్ణయాలు అన్నింటినీ అంగీకరించడం కుదరదు. అందులో చాలా వరకు బీసీసీఐకి సమ్మతం కానివే" అని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా టీ20, వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో దిగుమతి చేసుకొనే యంత్రాలపై సుంకం విధిస్తారు. వరల్డ్‌కప్‌ను స్టార్‌ నెట్‌వర్క్‌ ప్రసారం చేయనుంది. ఇప్పటికే భారత్‌లో స్టార్‌కు సంబంధించిన పూర్తి యంత్రాలు, యంత్రాంగం ఉన్నప్పుడు ఇక మినహాయింపు ఎందుకని బీసీసీఐ ప్రశ్నిస్తుండటం విశేషం.

Story first published: Tuesday, March 5, 2019, 14:18 [IST]
Other articles published on Mar 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+