11 ఏళ్ల తర్వాత మళ్లీ: కోహ్లీ Vs కేన్ చరిత్రను పునరావృతం చేసేదెవరు?

హైదరాబాద్: అది కౌలాలంపూర్‌లోని క్రికెట్ స్టేడియం. 2008 అండర్-19 ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత జట్టుగా విరాట్ కోహ్లీ... న్యూజిలాండ్‌కు కేన్ విలియమ్సన్ సారథ్యం వహించారు. మళ్లీ 11 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఈ ఇద్దరిపై అందరి దృష్టి పడింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఎందుకంటే అండర్-19 ప్రపంచకప్ సెమీపైనల్ మ్యాచ్‌లో తమ జూనియర్ జట్లకు కెప్టెన్లుగా ఉన్న ఈ ఇద్దరూ మళ్లీ... మేటి బ్యాట్స్‌మెన్‌గా ఎదిగి చరిత్రను పునరావృతం చేసేందుకు సిద్ధమయ్యారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్‌లు ప్రపంచకప్ సెమీఫైనల్లో కెప్టెన్లుగా తలపడుతుండడం క్రికెట్ అభిమానులకు ఆసక్తి రేకెత్తిస్తోంది.
తమ జట్ల తరుపున అద్భుత ప్రదర్శన
మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఈ ఇద్దరు కెప్టెన్లు తమ జట్లను సమర్థంగానే నడిపిస్తున్నారు. ఇద్దరూ తమ జట్ల తరుపున అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఈ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ 8 మ్యాచ్‌ల్లో 63.14 యావరేజితో 442 పరుగులు చేస్తే.. కేన్ విలియమ్సన్ 96.20 సగటుతో 481 పరుగులు సాధించాడు. దీంతో నాకౌట్‌లో ఈ ఇద్దరూ తమ జట్లను ఎలా నడిపిస్తారన్నది ఆసక్తికరంగా ఉంది.
2008లో మలేసియాలో జరిగిన
2008లో మలేసియాలో జరిగిన ఆ టోర్నీలో యువకులైన విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్ తొలిసారిగా తలపడ్డారు. వర్ష ప్రభావిత ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా డక్‌వర్త్ లూయిస్ పద్దతిన మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో బౌలింగ్‌లోనూ కోహ్లీ ఏడు ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. ఇందులో కేన్ విలియమ్సన్ వికెట్ కూడా ఉంది.
జడేజా, ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీలు ఇప్పుడు
ఈ రెండు జట్లలో ఉన్న జడేజా, ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీలు ఇప్పుడు ఈ ప్రపంచకప్ సెమీస్‌లో కూడా ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ మళ్లీ చరిత్రను పునరావృతం చేస్తాడా? లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలుతుంది. కాగా, ప్రపంచకప్ తొలి సెమీఫైనల్‌లో భాగంగా మంగళవారం మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.
చాలామంది నా బ్యాచ్‌మేట్సే
న‌్యూజిలాండ్ టీమ్‌లో ఉన్న క్రికెటర్లలో చాలామంది తన బ్యాచ్‌మేట్సేనని టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. తామందరూ కలిసి 2008లో అండర్-19 ప్రపంచకప్ టోర్నమెంట్ ఆడామని గుర్తు చేశారు. 2008లో కివీస్‌తో అండర్ 19 వరల్డ్‌కప్ సెమీస్ ఆడిన అంశాన్ని విలియమ్‌సన్‌కు గుర్తు చేయనున్నట్లు కోహ్లీ చెప్పాడు.
గొప్పగా ఉందన్న కోహ్లీ
మళ్లీ 11 ఏళ్ల తర్వాత ఇద్దరమూ జాతీయ జట్లకు వరల్డ్‌కప్‌లో నాయకత్వం వహించడం గొప్పగా ఉందని కోహ్లీ అన్నాడు. కివీస్‌తో పాటు మా జట్టు నుంచి కూడా అండర్ 19లో ఆడిన అనేక మంది ప్లేయర్లు వరల్డ్‌కప్‌లో ఆడుతున్నట్లు కోహ్లీ చెప్పాడు. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని తాను కానీ, విలియమ్‌సన్ కానీ ఊహించలేదన్నాడు. ఉత్తమ క్రికెట్ ఆడాలన్న దానిపై తాము శ్రద్ధపెట్టినట్లు కోహ్లీ తెలిపాడు.
నాణ్యమైన బౌలర్ లేని ప్రతీసారి
జట్టులో నాణ్యమైన బౌలర్ లేని ప్రతీసారి తాను బౌలింగ్ చేశానని కోహ్లీ సరదాగా నవ్వుతూ వ్యాఖ్యానించారు. తాను ఆల్‌రౌండర్‌గా ఎదగాలనే ఉద్దేశంతో కేరీర్‌ను మొదలు పెట్టానని చెప్పారు. ఆల్‌రౌండర్ అనిపించుకోవాలనే కోరికతో బౌలింగ్‌పైనా పట్టు సాధించానని అన్నారు. తనకు బౌలింగ్ చేయాల్సిన అవసరం గానీ, అవకాశం గానీ రాలేదని కోహ్లీ వ్యాఖ్యానించారు.
నేను అత్యంత ప్రమాదకరమైన బౌలర్‌ని
తాను అత్యంత ప్రమాదకరమైన బౌలర్‌నని అన్నారు. కేన్ విలియమ్సన్, బౌలర్ ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీతో పాటు చాలామంది క్రికెటర్లు తన బ్యాచ్‌మేట్లని, తామందరం కలిసి అండర్-19 ప్రపంచకప్ టోర్నమెంట్ ఆడామని అన్నారు. తన బ్యాచ్‌మేట్లతోనే మరోసారి ప్రపంచకప్ టోర్నమెంట్ ఆడాల్సిన రోజు ఒకటి వస్తుందని తాను ఏమాత్రం ఊహించనే లేదని చెప్పాడు.
{headtohead_cricket_3_4}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications