ఈ ప్రపంచకప్‌లో నాలుగో సెంచరీ: సంగక్కర రికార్డు సమం చేసిన రోహిత్ శర్మ

హైదరాబాద్: బర్మింగ్‌హామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. విభిన్న పిచ్‌లు, భిన్న పరిస్థితుల్లో ఒకే తరహా ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.. 90 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో రోహిత్ శర్మ సెంచరీని నమోదు చేశాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మకు ఇది నాలుగో సెంచరీ కాగా... మొత్తంగా 26వ సెంచరీ కావడం విశేషం. తద్వారా ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కర(4 సెంచరీలు) రికార్డుని రోహిత్ శర్మ సమం చేశాడు. ఇక, ప్రపంచకప్‌లో రోహిత్ శర్మకు ఇది ఐదో సెంచరీ.
రోహిత్ కన్నా ముందు సచిన్ టెండూల్కర్ ఆరు సెంచరీలతో ముందున్నాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఇప్పటికే 500 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మెగా టోర్నీలో ఇప్పటికే దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లాండ్‌లపై సెంచరీలు సాధించాడు. ఇప్పుడు బంగ్లాపై సెంచరీతో చెలరేగాడు.
షకీబ్ వేసిన 29వ ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. సెంచరీ అనంతరం దూకుడుగా ఆడే క్రమంలో రోహిత్ శర్మ 92 బంతుల్లో 104(7 ఫోర్లు, 5 సిక్సులు) సౌమ్య సర్కార్ బౌలింగ్‌లో లిట్టన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో జట్టు స్కోరు 180 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.
180 పరుగుల వద్ద తొలి వికెట్
ప్రస్తుతం 29.2 ఓవర్లకు గాను టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 180 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (72), కోహ్లీ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. తమీమ్ ఇక్బాల్ క్యాచ్ మిస్ చేయడంతో తనకు లభించిన లైఫ్‌తో రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
రోహిత్ శర్మ ఖాతాలో అరుదైన రికార్డు
కాగా, అంతకముందు రోహిత్ శర్మ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ శర్మ 440 పరుగులు చేశాడు. తాజాగా, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఏడాది వన్డేల్లో 1000 పరుగులు సాధించాడు.

ఈ ఏడాది 1000 పరుగులు
మ్యాచ్‌కు ముందు ఈ ఏడాది 1000 పరుగులు సాధించడానికి నాలుగు పరుగుల దూరంలో ఉన్న రోహిత్ శర్మ సిక్స్ బాది ఈ ఘనత సాధించాడు. బంగ్లాదేశ్ బౌలర్ మొర్తజా వేసిన తొలి ఓవర్ నాలుగో బంతిని సిక్స్‌గా బాది రోహిత్ శర్మ తన పరుగుల ఖాతా తెరిచాడు. రోహిత్ శర్మ 1000 పరుగులను తన 20వ ఇన్నింగ్స్‌లో అందుకున్నాడు.

మూడో క్రికెటర్‌గా రోహిత్ శర్మ
తద్వారా ఈ ఏడాది 1000 పరుగులు అందుకున్న మూడో క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మకు ముందు ఆరోన్ పించ్(1138), ఉస్మాన్ ఖవాజా(1067)లు 1000 పరుగులు సాధించారు. రోహిత్ శర్మ గత 19 మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలతో 996 పరుగులు చేశాడు. రోహిత్ యావరేజి 55.33గా నమోదైంది.
{headtohead_cricket_3_10}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications