For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ శర్మ సెంచరీ: బంగ్లాదేశ్ విజయ లక్ష్యం 315

ICC WC 2019: India vs Bangladesh, Live Score: Mustafizur Rahman keeps India to 314 after Rohit Sharma 104

హైదరాబాద్: బర్మింగ్‌హామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ 92 బంతుల్లో 104(7 ఫోర్లు, 5 సిక్సులు) సెంచరీకి తోడు... కేఎల్ రాహుల్ 92 బంతుల్లో 77(6 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్‌కు 315 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ 5వికెట్లు తీయగా... షకీబ్ ఉల్ హాసన్, రుబెల్ హుస్సేన్, సౌమ్య సర్కార్ తలో వికెట్ తీసుకున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 90 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో సెంచరీని నమోదు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మకు ఇది నాలుగో సెంచరీ కాగా... మొత్తంగా 26వ సెంచరీ కావడం విశేషం. తద్వారా ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కర(4 సెంచరీలు) రికార్డుని రోహిత్ శర్మ సమం చేశాడు.

500 పరుగుల మైలురాయిని అందుకున్న రోహిత్

ప్రస్తుత ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఇప్పటికే 500 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మెగా టోర్నీలో ఇప్పటికే దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లాండ్‌లపై సెంచరీలు సాధించాడు. ఇప్పుడు బంగ్లాపై సెంచరీతో చెలరేగాడు. షకీబ్ వేసిన 29వ ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. సెంచరీ అనంతరం దూకుడుగా ఆడే క్రమంలో రోహిత్ శర్మ 92 బంతుల్లో 104(7 ఫోర్లు, 5 సిక్సులు) సౌమ్య సర్కార్ బౌలింగ్‌లో లిట్టన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చాడు.

తొలి వికెట్‌కు 180 పరుగులు

దీంతో జట్టు స్కోరు 180 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(26: 27 బంతుల్లో 3ఫోర్లు) ఈ మ్యాచ్‌లో తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరి నిరాశపరిచాడు. ముస్తాఫిజుర్ వేసిన 39వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి డీప్‌ స్కేర్‌లెగ్‌లో రుబెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

హార్దిక్ పాండ్యా డకౌట్

అనంతరం క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(0) కూడా ఎదుర్కొన్న రెండో బంతికే స్లిప్‌లో సౌమ్య సర్కార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ధోనీ, పంత్‌లు కలిసి జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత జట్టు స్కోరు 277 పరుగుల వద్ద రిషబ్ పంత్(48) షకీబ్ ఉల్ హాసన్ బౌలింగ్‌లో హుస్సేన్‌కు క్యాచ్ ఇవ్వడంతో తృటిలో హాఫ్ సెంచరీని మిస్సయ్యాడు.

పంత్ ఔటైన తర్వాత స్కోరు బోర్డులో తగ్గిన వేగం

రిషబ్ పంత్ ఔటైన తర్వాత టీమిండియా స్కోరు బోర్డులో వేగం తగ్గింది. ధోని దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆఖరి ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి 35 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో షకీబ్ ఉల్ హాసన్‌కు క్యాచ్ ఇచ్చాడు. చివర్లో భువనేశ్వర్ రనౌట్ కాగా, ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి షమీ బౌల్డయ్యాడు.

5 వికెట్లు తీసిన ముస్తాఫిజుర్ రెహ్మాన్

దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ 5 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేయగా... షకీబ్ ఉల్ హాసన్, రుబెల్ హుస్సేన్, సౌమ్య సర్కార్ తలో వికెట్ తీసుకున్నారు.

1
43683

{headtohead_cricket_3_10}

Story first published: Tuesday, July 2, 2019, 19:10 [IST]
Other articles published on Jul 2, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+