
హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
కేదార్ స్ధానంలో దినేశ్ కార్తీక్, కుల్దీప్ యాదవ్ స్థానంలో భువనేశ్వర్ కుమార్‌లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ కూడా రెండు మార్పులు చేసింది. మహ్మదుల్లా, మిర్జ్ స్థానాల్లో రూబెల్ హుస్సేన్, షబ్బీర్ రెహ్మాన్‌లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్‌కు ఇది 200వ వన్డే కావడం విశేషం.
ఈ ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు ఆదివారం నాటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింట విజయం సాధించి ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. మరో మ్యాచ్ రద్దు అయింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే 13 పాయింట్లతో భారత్ సెమీస్ చేరుతుంది.
ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే తదుపరి శ్రీలంకపై తప్పక విజయం సాధించాల్సి ఉంటుంది. మరోవైపు బంగ్లాదేశ్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించి... 3 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దు అయింది. ప్రస్తుతం 7 పాయింట్లతో బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఆరో స్థానంలో కొనసాగుతుంది. బంగ్లాదేశ్ కూడా టోర్నీలో ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో బంగ్లా తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీమిండియా రెండింట విజయం సాధించగా.. బంగ్లా ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది.
జట్ల వివరాలు:
ఇండియా: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, ధోని(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, యుజవేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా
బంగ్లాదేశ్: మష్రఫె మొర్తాజా(కెప్టెన్), సౌమ్య సర్కార్, తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్, షకీబ్ ఉల్ హాసన్, ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), మొసద్దీక్ హుస్సేన్, మహ్మద్ సైఫుద్దీన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, రూబెల్ హుస్సేన్, షబ్బీర్ రెహ్మాన్
{headtohead_cricket_3_10}