
భువీ గాయపడటంతో షమీకి ఛాన్స్
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయపడటంతో అతడి స్థానంలో షమీ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక, బుమ్రా విషయానికి వస్తే ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ప్రపంచకప్‌లో భారత అత్యుత్తమ బౌలర్‌గా కొనియాడబడుతున్నాడు. భువీ చేతి గాయం కారణంగా తుది జట్టులో చోటు దక్కించుకున్న షమీ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆప్ఘనిస్థాన్, వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగేసి వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు
ఇక, గత ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే భారీ స్కోరు దిశగా సాగుతున్న ఇంగ్లాండ్‌ను తన అద్భుతమైన పేస్ బౌలింగ్‌తో షమీ కట్టడి చేసిన తీరు అద్భుతం. తొలి ఏడు ఓవర్లలో 25 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసిన షమీ... చివరి మూడు ఓవర్లలో 44 పరుగులు సమర్పించుకున్నాడు. చివరి ఓవర్లలో షమీ యార్కర్లను ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ స్టోక్స్-బట్లర్ సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు.
మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో షమీ 9 ఓవర్లు వేసి ఒక వికెట్ తీసి 68 పరుగులు ఇచ్చాడు.

ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్ బంతులతో
క్రీజులో పాతుకుపోయి నిలకడగా ఆడుతున్న ఓపెనర్ తమీమ్ ఇక్బాల్‌ను తనదైన శైలిలో పెవిలియన్‌కు చేర్చాడు. బంగ్లా మ్యాచ్‌లో షమీ కాస్తంత దూకుడుగా వ్యవహారించాడు. ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్ బంతులతో ప్రత్యర్ధులను హడలెత్తించాడు. ఇక, ఈ ప్రపంచకప్‌లో భారత పేస్ బౌలింగ్ దళానికి 25 ఏళ్ల జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తున్నాడు. గుజరాత్‌కు చెందిన ఈ పేసర్ ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లతో జరిగిన మ్యాచ్‌లను గమనిస్తే బుమ్రా స్పెల్స్ అద్భుతం.

బుమ్రా నాయకత్వంలో భారత పేస్ బౌలింగ్
పరుగులు కట్టడి చేసిన విధానం చెప్పుకోదగ్గది. ఈ ప్రపంచకప్‌లో మిగతా జట్లలోని బౌలర్లతో పోలిస్తే బుమ్రా అతి తక్కువ ఎకానమీ కలిగిన బౌలర్లలో ఒకడు. న్యూజిలాండ్‌కు చెందిన ట్రెంట్ బౌల్ట్ 4.55 ఎకానమీతో ఉండగా.... బుమ్రా ఎకానమీ 4.60గా నమోదైంది. భారత్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో షమీ, బుమ్రా ఇద్దరూ 14 వికెట్లతో సమానంగా ఉన్నారు. మంగళవారం బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా నాలుగు వికెట్లు తీసి 55 పరుగులిచ్చాడు.

బంగ్లాపై నాలుగు వికెట్లు తీసిన బుమ్రా
ఇందులో ఒక ఓవర్ మెయిడిన్. కీలక సమయాల్లో వికెట్లు తీసి భారత విజయాల్లో వీరిద్దరూ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఐపీఎల్ పుణ్యమా అని భారత బౌలర్లు ఒత్తిడి సమయాల్లో ఎలా బౌలింగ్ వేయాలో కూడా నేర్చుకున్నారు. బుమ్రా బౌలింగ్ చేసే తీరే భిన్నంగా ఉంటుంది. బంతి బంతికీ పేస్‌లో తేడా ఉంటుంది. యార్కర్ల వేయడంలో దిట్ట. బుమ్రా వేసిన యార్కర్‌తో గాయపడి ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడంటే అర్ధం చేసుకోవచ్చు బుమ్రా యార్కర్లు ఎంత పవర్‌పుల్లో.

స్లో డెలివరీకి తొలి వికెట్
బంగ్లాతో మ్యాచ్‌లో బుమ్రా తొలి వికెట్ తీసిన స్లో డెలివరీకి. బుమ్రా వేసిన స్లో డెలివరీని షబ్బీర్ రెహ్మాన్ ఆడదామనుకునే లోపే లెగ్ స్టంప్‌ను తాకింది. ఆ తర్వాత మొసద్దిక్ హుస్సేన్. ఓ అద్భుతమైన బంతికి మొసద్దిక్ హుస్సేన్ పెవిలియన్‌కు చేరాడు. ఇక ఆఖరి ఓవర్లలో రూబెల్ రుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను ఔట్ చేశాడు. బుమ్రా, షమీ అద్భుత ప్రదర్శన ఇలాగే కొనసాగితే ఈ ప్రపంచకప్ భారత్ సొంతం అవడం ఖాయం.


Click it and Unblock the Notifications












