For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ టీ20 ఫైనల్: 'మరో రెండు డ్రెస్సింగ్ రూమ్‌లు కావాలి'

By Nageswara Rao

కోల్‌కత్తా: కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌ మైదానంలో అదనంగా మరో రెండు డ్రెస్సింగ్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఐసీసీ, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్‌కు సూచించింది. ఇందుకు కారణం భారత్‌లో వచ్చే ఏడాది నిర్వహించనున్న ఐసీసీ వరల్డ్ టీ20 ఫైనల్‌కు ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమివ్వడమే.

వచ్చే ఏడాది ఏప్రిల్ 3వ తేదీన ఐసీసీ వరల్డ్ టీ20 ఫైనల్ మ్యాచ్‌కి ఈడెన్ గార్డెన్స్‌ ఆతిథ్యమిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రెండు డ్రెస్సింగ్ రూమ్‌లు మాతమే ఉన్నాయి. ఒకటి సొంత జట్టుకు కాగా, మరొకటి ఆతిథ్య జట్టుకు కేటాయిస్తారు.

అయితే అదే రోజున ఉమెన్స్ వరల్డ్ టీ20 ఫైనల్ మ్యాచ్ కూడా జరుగుతుండటంతో క్రికెట్ వరల్డ్ గవర్నింగ్ బాడీ క్యాబ్‌కు నాలుగు డ్రెస్సింగ్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించింది. 2016లో ఫైనల్‌కు ఆతిథ్యమిచ్చిన బంగ్లాదేశ్‌లోని మిర్‌పుర్‌లోని షేర్ ఈ బంగ్లా స్టేడియం కూడా ఇదే సమస్యను ఎదుర్కొంది.

ICC wants 2 more dressing rooms at Eden for World T20 final

ఇదే కారణంతో అక్కడ కూడా నాలుగు డ్రెస్సింగ్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. భారత్‌లో తొలిసారిగా జరగనున్న ఈ వరల్డ్ టీ20 మార్చి 11 నుంచి ఆరంభం కానుంది. వరల్డ్ ట్వంటీ20 2016 టోర్నమెంట్‌లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. వరల్డ్ ట్వంటీ20 ప్రత్యేకత ఏంటంటే ఏ ఒక్క జట్టు కూడా ఈ టోర్నీని రెండోసారి గెలవకపోవడమే.

వరల్డ్ టీ20 ఛాంపియన్లు:

* 2007 - India beat Pakistan by 5 runs in final (Hosts South Africa)
* 2009 - Pakistan beat Sri Lanka by 8 wickets in final (England)
* 2010 - England beat Australia by 7 wickets in final (West Indies)
* 2012 - West Indies beat Sri Lanka by 36 runs in final (Sri Lanka)
* 2014 - Sri Lanka beat India by 6 wickets in final (Bangladesh)

తెలుగు వన్ఇండియా

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+