Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత ఆటగాళ్లని ప్రోత్సహించండి: ద్రవిడ్ (వీడియో)

ICC Under-19 World Cup 2018: Coach Rahul Dravid Asks All To Support Indian Boys

హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ 45వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా భారత జట్టు మాజీ క్రికెటర్లైన తన సహచరులనుంచి శుభాకాంక్షలు అందుకున్నాడు. క్రికెట్ ఒక జెంటిల్ మాన్ గేమ్ అనే మాటను ద్రవిడ్ సాకారం చేశారని పలువురి ప్రశంసలను కూడా అందుకున్నాడు.

ఈ ఆదివారం ఆస్ట్రేలియాతో భారత్ అండర్-19జట్టు తలపడనున్నాయి. అయితే అండర్-19జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తోన్న ద్రవిడ్ పర్యటనలో భాగంగా ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉన్నారు. పుట్టినరోజు వేడుకల అనంతరం ఆయన తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. దానికి సంబంధించిన వీడియోను ఐసీసీ వరల్డ్ కప్ తన అధికారికి ట్విట్టర్ ఖాతాలో ఉంచింది.

ఆ వీడియోలో ద్రవిడ్.. 'భారత ఆటగాళ్లకు సహకరించండి. జట్టులో క్రీడాకారులు బాగా శ్రమించి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటున్నారు. ప్రజాదరణ ముఖ్యం కాబట్టి మీరు వారి ప్రతి మ్యాచ్‌ని చూసి ఆదరిస్తారనుకుంటున్నాను. ధన్యవాదాలు' అని ముగించాడు.

ద్రవిడ్ ఇప్పటి వరకు క్రీడాకారుడిగా తన పదిహేనేళ్ల కెరీర్‌లో 164 టెస్ట్‌లు ఆడి 13,288పరుగులు, 344వన్డేలు వన్డే మ్యాచ్‌లు ఆడి10,889, ఒక టీ20 లో పాల్గొని (31)పరుగులను సాధించాడు. సహనమే ద్రవిడ్ మొదటి ఆయుధం అని కూడా చాలా మంది చెప్తుంటారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 11, 2018, 16:37 [IST]
Other articles published on Jan 11, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+