For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC Under-19 Cricket World Cup 2020: భారత షెడ్యూల్, టీమ్స్, గ్రూప్స్ తదితర వివరాలు!

ICC Under-19 Cricket World Cup 2020: Team India schedule, teams, groups, date, timings and venues

హైదరాబాద్: అండర్‌-19 ప్రపంచకప్‌ అంటే గతంలో అభిమానులకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అయితే, కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా 2008లో ప్రపంచకప్ గెలవడంతో ఈ టోర్నీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆతర్వాత 2012, 2018లోనూ టీమిండియానే విశ్వవిజేతగా నిలిచింది. అండర్‌-19 ప్రపంచకప్‌ భారత్ మొత్తం నాలుగు సార్లు గెలిచింది.

2000లో మహ్మద్‌ కైఫ్‌ ఆధ్వర్యంలో భారత యువ జట్టు తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. కాగా, 2018లో జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌‌లో టీమిండియా పృథ్వీ షా నేతృత్వం బరిలోకి దిగింది. న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించి నాలుగోసారి టైటిల్‌ గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.

జనవరి 17 నుంచి దక్షిణాఫ్రికా వేదికగా

జనవరి 17 నుంచి దక్షిణాఫ్రికా వేదికగా

జనవరి 17 నుంచి దక్షిణాఫ్రికా వేదికగా అండర్-19 ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. ఈ టోర్నీలో భాగంగా ఢిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ఈసారి భారత జట్టుకు యువ ఆటగాడు ప్రియం గార్గ్‌ కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు. ఇటీవలే గార్గ్‌ను ఐపీఎల్‌ వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.1.9 కోట్లకు సొంతం చేసుకుంది.

యశస్వీ జైస్వాల్‌పై అంచనాలు

యశస్వీ జైస్వాల్‌పై అంచనాలు

పిన్న వయస్సులోనే లిస్ట్‌-ఎ మ్యాచ్‌ల్లో డబుల్‌ సెంచరీ చేసిన యశస్వీ జైస్వాల్‌పై ఈ టోర్నీలో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా యువ భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలోనే ఉంది. ఇప్పటికే మన జట్టు మూడు వన్డేల సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈరోజు నుంచి 9వతేదీ వరకు క్వాడ్రాంగ్యులర్‌ సిరీస్‌ కూడా ఆడబోతోంది.

టోర్నీలో మొత్తం 16 జట్లు

టోర్నీలో మొత్తం 16 జట్లు

ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ 13వ సీజన్ కావడం విశేషం. ఈ సీజన్ రెండో అర్ధభాగం సూపర్ లీగ్ మాదిరి జరగనుంది. న్యూజిలాండ్, శ్రీలంక, జపాన్‌లతో పాటు భారత క్రికెట్ జట్టు గ్రూప్-ఏలో ఉంది. ఈ టోర్నీలో మొదటిసారి జపాన్ తలపడుతోంది. భారత క్రికెట్ జట్టు తన తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడుతుండగా... ఆ తర్వాత జనవరి 21న జపాన్‌తో, జనవరి 24న న్యూజిలాండ్‌తో తలపడనుంది.

శాశ్వత సభ్యదేశాలతో పాటు మరో ఐదు

శాశ్వత సభ్యదేశాలతో పాటు మరో ఐదు

జనవరి 17న దక్షిణాఫ్రికా-అఫ్ఘానిస్థాన్‌ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమవుతుంది. శాశ్వత సభ్యదేశాలైన భారత్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక, ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌, ఆస్ర్టేలియా, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, జింబాబ్వే, అఫ్ఘానిస్థాన్‌, దక్షిణాఫ్రికా జట్లు టోర్నీకి నేరుగా అర్హత సాధించాయి. వీటితో పాటు ఐదు రీజియన్ల నుంచి కొత్తగా ఐదు జట్లను కూడా ఈసారి ఎంపిక చేశారు. ఆఫ్రికా నుంచి నైజీరియా, అమెరికాస్‌ నుంచి కెనడా, యూరప్‌ నుంచి స్కాట్లాండ్‌, ఈస్ట్‌ ఆసియా పసిఫిక్‌ నుంచి జపాన్‌, ఆసియా నుంచి యూఏఈ జట్లు చోటు దక్కించుకున్నాయి.

మొత్తం నాలుగు గ్రూపులు

మొత్తం నాలుగు గ్రూపులు

గ్రూప్ ఎ: ఇండియా, న్యూజిలాండ్, శ్రీలంక, జపాన్

గ్రూప్ బి: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, నైజీరియా

గ్రూప్ సి: పాకిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే, స్కాట్లాండ్

గ్రూప్ డి: ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, యుఎఇ, కెనడా.

అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఇదే

అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఇదే

జనవరి 19 భారత్‌ vs శ్రీలంక

జనవరి 21 భారత్‌ vs జపాన్‌

జనవరి 24 భారత్‌ vs న్యూజిలాండ్‌

జనవరి 27 నుంచి నాకౌట్‌ మ్యాచ్‌లు.

Story first published: Friday, January 3, 2020, 16:52 [IST]
Other articles published on Jan 3, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+