ఎవరు గెలిచినా చరిత్రే
ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లో ఇప్పటవరకు ఏ జట్టు కూడా నాలుగు సార్లు విశ్వవిజేతగా అవతరించలేదు. ఫైనల్లో ఆస్ట్రేలియా గెలిచినా ఈ రికార్డుని సొంతం చేసుకుంది. అటు భారత్, ఇటు ఆస్ట్రేలియా ఇప్పటివరకు మూడు సార్లు వరల్డ్‌కప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాయి. దీంతో ఎవరు గెలిస్తే వాళ్లు సరికొత్త చరిత్రను సృష్టిస్తారు. అయితే ఫైనల్లో ఫేవరేట్‌గా టీమిండియా బరిలోకి దిగుతోంది.
ఐదు మ్యాచుల్లో గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత్
న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచుల్లో గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టింది. టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ పృథ్వి షా (94), ఓపెనర్ మన్‌జోత్ కల్రా (86), శుభ్‌మాన్ గిల్ (63) హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియా 328 పరుగులు చేసింది.
తొలి మ్యాచ్‌లో ఆసీస్‌పై విజయం
ఆ తర్వాత భారత బౌలర్ల దెబ్బకు ఆస్ట్రేలియా 228 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత వరుసగా పపువా న్యూ గినియా, జింబాబ్వే, బంగ్లాదేశ్, పాక్‌లపై భారత్ విజయం సాధించింది. ఈ టోర్నీలో కెప్టెన్ పృథ్వి షాతోపాటు శుభమాన్ గిల్, మన్‌జోత్ కల్రా, కమలేష్ నాగర్‌కోటి, అనుకుల్ రాయ్, ఇషాన్ పోరెల్ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ముఖ్యంగా శుభమాన్ గిల్ టోర్నీలో వరుసగా ఐదుసార్లు 50కిపైగా స్కోర్లు సాధించాడు.
ఫామ్‌లో శుభమాన్ గిల్
పాకిస్థాన్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకముందు 2000, 2008, 2012లలో టీమిండియా అండర్-19 వరల్డ్ కప్ విజేతగా అవతరించింది. 2000లో మహ్మద్ కైఫ్ కెప్టెన్సీలో, 2008లో విరాట్ కోహ్లి కెప్టెన్సీలో, 2012లో ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది.
2012 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం
2012లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాపైనే భారత్ విజయం సాధించడం విశేషం. ఇప్పుడు పృథ్వి షా నేతృత్వంలోని భారత యువ జట్టు అండర్-19 విశ్వవిజేతగా నిలవాలని సగటు భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. ఈ ఫైనల్ మ్యాచ్ శనివారం (ఫిబ్రవరి 3) ఉదయం 6.30 గంటలకు ప్రారంభం కానుంది.

మ్యాచ్ డిటేల్స్:
ఇండియా Vs ఆస్ట్రేలియా
ICC Under-19 Cricket World Cup final (ICC U19CWC final)
ఉదయం 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ 1లో ప్రత్యక్ష ప్రసారం
లైవ్ స్ట్రీమ్: Hotstar.com

జట్ల వివరాలు:
ఇండియా: పృథ్వీ షా (Capt), శుభమాన్ గిల్, ఆర్యన్ జుయాల్, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్, హార్విక్ దేశాయ్, మన్‌జ్యోత్ కార్లా, కమలేష్ నాగర్‌కోటి, పంకజ్ యాదవ్, రేయాన్ పరాగ్, ఇషాన్ పోరేల్, హిమాంశు రాణా, అనుకుల్ రాయ్, శివమ్ మావి, శివ సింగ్
ఆస్ట్రేలియా: జాసన్ సాన్యా (కెప్టెన్), విల్ సదర్లాండ్, జేవియర్ బార్ట్లెట్, మాక్స్ బ్రయంట్, జాక్ ఎడ్వర్డ్స్, జాక్ ఎవాన్స్, జారోడ్ ఫ్రీమాన్, ర్యాన్ హాడ్లీ, బాక్టర్ హాల్ట్, నాథన్ మెక్స్వీనీ, జోనాథన్ మెర్లో, లాయిడ్ పోప్, జాసన్ రాల్స్టన్, పరాం ఉప్పల్, ఆస్టిన్ వా


Click it and Unblock the Notifications












