For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC U19 Worldcup: భారత అమ్మాయిలు ధనాధన్.. ఫైనల్ కు అర్హత

అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో భారత అమ్మాయిలు ఫైనల్ కు అర్హత సాధించారు. ప్రస్తుతం జరిగిన సెమీ ఫైనల్ లో.. 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మన అమ్మాయిలు .. 9 వికెట్ల తేడాతో గెలుపొందారు. 15 ఓవర్లలో వికెట్ నష్టానికి 117 పరుగులు చేశారు.

భారత బ్యాటర్లలో జి కమలిని 50 బంతుల్లో 8 ఫోర్లతో అజేయ 56 పరుగులు చేసింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష 29 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 35 రన్స్ సాధించింది. సానికా చాల్కే 12 బంతుల్లో 1 ఫోర్ సాయంతో 11 పరుగులు చేసింది. ఫోబ్ బ్రెట్.. త్రిష వికెట్ తీసింది.

ICC U19 Worldcup TeamIndia Women U19 beats England Women U19 by 9 wickets in semifinal

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. డేవినా పెర్రిన్ (40 బంతుల్లో 45 - 6 ఫోర్లు, 2 సిక్స్ లు), అబి నోర్రోవ్ (25 బంతుల్లో 30 - 3 ఫోర్లు, ఓ సిక్స్) మెరుగ్గా రాణించారు.

జెమీమా స్పెన్స్ (9), చార్లొట్టే స్టబ్స్ (4), ప్రిషా థానావాలా (2), అము సురెన్ కుమార్ (14), టిల్లీ కొర్టీన్ కొలెమాన్(7 నాటౌట్) విఫలమయ్యారు. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ 3 వికెట్లు పడగొట్టగా, పరునికా 3 వికెట్లు తీసింది. ఆయుషి 2 వికెట్లు పడగొట్టింది.

మరో సెమీస్ లో సౌతాఫ్రికా..

ఈ ప్రపంచ కప్ లోని మరో సెమీస్‌ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టుపై సౌతాఫ్రికా విజయం సాధించింది. ఆస్ట్రేలియా‌ నిర్దేశించిన 105 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 106 పరుగులు చేసింది. అంతకుముందు సౌతాఫ్రికా బౌలర్ ఆష్లే వాన్‌ వైక్ (4/17) ఆసీస్ ను దెబ్బ తీశాడు.

Story first published: Friday, January 31, 2025, 14:51 [IST]
Other articles published on Jan 31, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+