Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20 వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ విడుదల.. టైటిల్ వేటలో భారత్!

ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ 2027 షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. మహిళల క్రికెట్ పరిధిని విస్తరించడం, కొత్త ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో 2023లో ప్రారంభమైన ఈ టోర్నమెంట్.. ఇప్పుడు మూడో ఎడిషన్‌కు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా భారత యువ జట్టు మళ్లీ టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి సిద్ధమవుతోంది.

IND vs NZ: వైభవ్‌తో సహా ఐదుగురికి నో ఛాన్స్.. కివీస్‌తో తొలి టీ20లో తుది జట్టు ఇదే!

IND vs NZ: వైభవ్‌తో సహా ఐదుగురికి నో ఛాన్స్.. కివీస్‌తో తొలి టీ20లో తుది జట్టు ఇదే!

టోర్నీ వేదికలు, తేదీలు
ఈ ప్రపంచ కప్ 2027 జనవరి 21 నుంచి బంగ్లాదేశ్, నేపాల్ దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. మొత్తం 16 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో 41 మ్యాచ్‌లు జరగనున్నాయి. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్. సిల్హెట్ స్టేడియాలతో పాటు నేపాల్‌లోని ఖాట్మండులో ఉన్న త్రిభువన్ యూనివర్సిటీ గ్రౌండ్, అప్పర్ ముల్పానీ మైదానాలు ఈ మ్యాచ్‌లకు వేదికగా నిలవనున్నాయి.

ICC U19 Womens T20 World Cup 2027 Schedule Released India Aim to Defend Their Title Full Details

భారత్, పాకిస్తాన్ గ్రూపుల వివరాలు
హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న భారత జట్టు గ్రూప్-ఏలో చోటు దక్కించుకుంది. ఈ గ్రూప్‌లో భారత్‌తో పాటు ఐర్లాండ్, నేపాల్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను జనవరి 22న వెస్టిండీస్‌తో ఆడనుంది. ఆ తర్వాత జనవరి 24న నేపాల్‌తో, జనవరి 26న ఐర్లాండ్‌తో తలపడనుంది. మరోవైపు పాకిస్తాన్ జట్టు గ్రూప్-బీలో ఉంది. దీనివల్ల గ్రూప్ దశలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగదు.

IND vs NZ: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌లు ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?

Also Read

IND vs NZ: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌లు ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?

గ్రూప్ ఏ: భారత్, ఐర్లాండ్, వెస్టిండీస్, నేపాల్

గ్రూప్ బీ: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సమోవా

గ్రూప్ సీ: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నైజీరియా, యూఏఈ

గ్రూప్ డీ: ఇంగ్లాండ్, శ్రీలంక, అమెరికా, స్కాట్లాండ్

టోర్నీ ఫార్మాట్, ఫైనల్ మ్యాచ్
జనవరి 26 నాటికి గ్రూప్ దశ మ్యాచ్‌లు పూర్తవుతాయి. ప్రతి గ్రూప్ దశ నుంచి అర్హత సాధించిన జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. సూపర్ సిక్స్ గ్రూపుల్లో టాప్-2లో నిలిచే నాలుగు జట్లు సెమీఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి. రెండు సెమీఫైనల్ మ్యాచ్ లు ఫిబ్రవరి 4న చిట్టగాంగ్ లో జరుగుతాయి. ప్రపంచ కప్ ఫైనల్ పోరు ఫిబ్రవరి 6న జరగనుండగా.. వర్షం లేదా ఇతర ఆటంకాల కోసం ఫిబ్రవరి 7ను రిజర్వ్ డేగా కేటాయించారు.

Story first published: Wednesday, October 21, 2026, 15:10 [IST]
Other articles published on Oct 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+