అండర్-19 వరల్డ్ కప్: కుర్రాళ్లకు ఎదురులేదు, టీమిండియా హ్యాట్రిక్

హైదరాబాద్: న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లో భారత యువ జట్టు దూసుకెళ్తోంది. ఈ టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని సాధించింది. టోర్నీలో భాగంగా శుక్రవారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే 48.1 ఓవర్లలో 154 పరుగులు చేసి ఆలౌటైంది. జింబాబ్వే ఆటగాళ్లు మధేవీరే(30), శుంభు(36), రోచి(31) తప్ప మిగతా ఆటగాళ్లు ఎవరూ రాణించలేకపోయారు. భారత ఆల్‌రౌండర్ అనుకుల్ రాయ్ ఈ మ్యాచ్‌లో కూడా అద్భుత ప్రదర్శన చేశాడు.
7.1 ఓవర్లు వేసిన అనుకుల్ రాయ్ 4 వికెట్లు తీశాడు. అర్షదీప్ సింగ్, అభిషేక్ శర్మ తలో రెండు తీసుకోగా... శివమ్, రియాన్ పరాగ్‌కు చెరో వికెట్ దక్కింది. అనంతరం 155 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 21.4 ఓవర్లలో జింబాబ్వే నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించింది.
భారత బ్యాట్స్ మెన్లలో శుభమ్ గిల్ (90 నాటౌట్), హర్విక్ దేశాయ్ (56 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. తాజా విజయంతో భారత యువ జట్టు గ్రూప్ బీలో అగ్రస్ధానంలో నిలిచింది. అంతకముందు ఆస్ట్రేలియా, పపువా న్యూగినియాలతో జరిగిన మ్యాచ్‌ల్లో విజయం సాధించి టోర్నీలో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications