Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నంబర్ వన్ గేమ్ ఆడకపోయినా గెలిచేశాం: ద్రవిడ్

Under-19 Boys Did Not Play Well But ‘Got Desired Result’
ICC U-19 World Cup: Rahul Dravid's Gem After India's Comprehensive Win Over Australia In Final

హైదరాబాద్: అండర్ 19 కుర్రాళ్లు భారత్ కు ప్రపంచ విజేతలుగా తిరిగొచ్చారు. స్వదేశంలో వారికి ఘన స్వాగతం లభించింది. రావడంతోనే అండర్-19 కోచ్, బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్, కుర్రాళ్ల కెప్టెన్ పృథ్వీ షా విజయానందాన్ని మీడియాతో ఇలా పంచుకున్నారు.

16 నెలలుగా కష్టపడిన తీరు కప్ గెలవడం కంటే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని అన్నాడు. 'అండర్‌-19 క్రికెట్ కప్‌ గెలవడం చాలా గర్వంగా ఉంది. కానీ, మా జట్టు ఫైనల్‌ మ్యాచ్‌లో నంబర్‌వన్‌ ఆట ఆడలేదు. అయితే మేం కోరుకున్న ఫలితమే వచ్చింది. కుర్రాళ్లు ఇంకా అసలైన ఆటను బయటపెట్టాల్సి ఉంది' అని ద్రవిడ్‌ అన్నాడు.

'కష్టపడితే ఎలాంటి ఫలితం ఉంటుందో ఈ విజయంతో వారు తెలుసుకున్నారు. అయితే తర్వాతి స్థానానికి వెళ్లడం అంత సులభం కాదు.2012లో అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులోని ఒకరికి మాత్రమే టీమిండియాలో ఆడే అవకాశం వచ్చింది. కాబట్టి అసలు పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది' అంటూ కుర్రాళ్లను ఉద్దేశించి ద్రవిడ్‌ అన్నారు.

యువ ఆటగాళ్లకు అసలు పరీక్ష ఇప్పుడే మొదలైందని ద్రవిడ్ అన్నాడు. కప్‌ గెలిచిన యువ జట్టుకు స్వదేశంలో లభించిన స్వాగతం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, February 6, 2018, 10:06 [IST]
Other articles published on Feb 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+