అండర్‌-19 ప్రపంచకప్‌.. శ్రీలంకపై భారత్‌ ఘన విజయం!!

ICC U-19 World Cup: India start off with easy win against Sri Lanka

బ్లూమ్‌ఫాంటైన్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన భారత్‌.. అండర్‌-19 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఘనంగా ఆరంభించింది. శ్రీలంకతో ఆదివారం జరిగిన గ్రూప్‌-ఎ లీగ్‌ మ్యాచ్‌లో యువ భారత్‌ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదటగా ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ (74 బంతుల్లో 8 ఫోర్లతో 59), కెప్టెన్‌ ప్రియం గార్గ్‌ (72 బంతుల్లో 2 ఫోర్లతో 56) భారీ స్కోర్ అందించగా.. ఆకాశ్‌ సింగ్‌, సిద్ధేశ్‌ వీర్‌ లంక పతనాన్ని శాసించారు.

మాజీ బౌలర్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. పిల్లల ఫోటో చూశాక ఆగిపోయా!!

298 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక 45.2 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. లంక కెప్టెన్ నిపున్‌ ధనంజయ (50; 2 ఫోర్లు, సిక్స్‌) హాఫ్‌ సెంచరీ చేయగా.. రవీందు రసంత (49; 5 ఫోర్లు), కామిల్ మిషారా (39) రాణించారు. లంక మిగతా బ్యాట్స్‌మన్‌ విఫలమయ్యారు. భారత బౌలర్లలో ఆకాశ్‌ సింగ్‌ (2/29), సిద్ధేష్‌వీర్‌ (2/34), రవి బిష్ణోయ్‌ (2/44) తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు టాస్‌ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 4 వికెట్లకు 297 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్‌, కెప్టెన్‌ ప్రియం గార్గ్‌ భారత ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేయగా.. చివర్లో ధ్రువ్‌ జురెల్‌ (48 బంతుల్లో 52 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌), సిద్ధేశ్‌ వీర్‌ (27 బంతుల్లో 44 నాటౌట్‌; 6 ఫోర్లు, సిక్స్‌) ధాటిగా ఆడారు. ఇక హైదరాబాదీ క్రికెటర్‌ తిలక్‌ వర్మ (53 బంతుల్లో 3 ఫోర్లతో 46) మెరిశాడు.

బ్యాటింగ్, బౌలింగ్‌తో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన సిద్ధేష్‌ వీర్‌ 'ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌'గా నిలిచాడు. భారత అండర్‌-19 జట్టు తదుపరి మ్యాచ్‌ను మంగళవారం జపాన్‌తో ఆడనుంది. ఆదివారం జరిగిన మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్ అండర్‌-19 జట్టుపై పాకిస్థాన్ అండర్‌-19 జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచింది. మొదటగా స్కాట్లాండ్ 23.5 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం పాక్ 11.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Read more about: cricket teamindia srilanka
Story first published: Monday, January 20, 2020, 8:23 [IST]
Other articles published on Jan 20, 2020
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more