Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌ ఫైనల్లో కుర్రాళ్ల అతి.. బంగ్లా, భారత ఆటగాళ్లపై ఐసీసీ చర్యలు!!

U19 World Cup Final 2020 : 3 Bangladesh, 2 Indian Players Penalised By ICC
ICC U-19 World Cup Final: 3 Bangladesh, 2 Indian Players Penalised By ICC For Fracas

దుబాయ్: అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో కుర్రాళ్ల శ్రుతిమించిన అతి ఉత్సాహంపై ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. బంగ్లాదేశ్‌ నుంచి ముగ్గురు, భారత్ నుంచి ఇద్దరిపై చర్యలు తీసుకున్నట్లు ఐసీసీ తాజాగా ప్రకటించింది. బ్రీచింగ్‌ కోడ్‌ లెవల్‌ 3 కింద ఈ ఐదుగురి ఖాతాలో అయోగ్యత పాయింట్లు చేర్చినట్టు పేర్కొంది.

హద్దులు దాటిన సంబరాలు:

హద్దులు దాటిన సంబరాలు:

పోచెఫ్‌స్ట్రూమ్‌ వేదికగా ఆదివారం జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌లో విజయానంతరం బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు హద్దులు దాటి మరీ సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే. తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆనందంలో బంగ్లాదేశ్‌ యువ ఆటగాళ్లు అతిగా ప్రవర్తించారు. విజయానికి అవసరమైన సింగిల్‌ రాగానే ఆటగాళ్లంతా ఉద్వేగంతో మైదానంలోకి పరిగెత్తుకొచ్చారు. వస్తూనే భారత ఆటగాళ్ల మీదకు వెళ్తూ గేలి చేస్తున్నట్టుగా అరిచారు.

 ఫైనల్లో కుర్రాళ్ల అతి:

ఫైనల్లో కుర్రాళ్ల అతి:

బంగ్లా పేసర్‌ షోరిఫుల్‌ ఇస్లాం భారత ఆటగాళ్లపై అభ్యంతకర వ్యాఖ్యలతో రెచ్చిపోయాడు. ఇక ఓ రిజర్వ్‌ ఆటగాడు ఏకంగా గొడవకు దిగడంతో సహించని ఓ భారత క్రికెటర్‌ అతడిని నెట్టివేసాడు. అక్కడే ఉన్న అంపైర్‌ జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగించాడు. దీనిని ఐసీసీ తీవ్రమైన విషయంగా పరిగణించి విచారణ చేపట్టింది. ఫైనల్‌లోని వీడియో ఫుటేజీలను ఐసీసీ అధికారులు పరిశీలించారు.

క్రమశిక్షణ చర్యలు:

క్రమశిక్షణ చర్యలు:

మైదానంలోని ప్లేయర్ల ప్రవర్తన, వీడియో ఫుటేజీలను పరిశీలించి మొత్తం ఐదుగురు ఆటగాళ్లపై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇక ఐసీసీ నియమావళిని ఉల్లఘించినట్లు ఆటగాళ్లు అంగీకరించారని కూడా ఐసీసీ పేర్కొంది. బంగ్లాదేశ్‌ జట్టులో తౌహిద్ హ్రిదోయ్‌, షమీమ్ హుస్సేన్‌, రకీబుల్‌ హసన్‌.. భారత జట్టులో ఆకాశ్‌ సింగ్, రవి బిష్టోయ్‌ ఐసీసీ నియమావళిని ఉల్లఘించినట్లు గుర్తించింది.

ఆటగాళ్లకు అయోగ్యత పాయింట్లు:

ఆటగాళ్లకు అయోగ్యత పాయింట్లు:

తౌహిద్‌, షమీమ్‌, ఆకాశ్‌ సింగ్‌కు ఆరు అయోగ్యత పాయింట్లు.. రకీబుల్‌, బిష్ణోయ్‌కు అయిదు అయోగ్యత పాయింట్లను ఐసీసీ ఇచ్చింది. అయితే టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రవి బిష్ణోయ్‌కు మరో రెండు అయోగ్యత పాయింట్లు ఇచ్చినట్లు కూడా పేర్కొంది. ఫైనల్లో భారత్‌పై బంగ్లా విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో బంగ్లా తొలిసారి ప్రపంచకప్‌ అందుకొని చరిత్ర సృష్టించింది.

Story first published: Tuesday, February 11, 2020, 11:59 [IST]
Other articles published on Feb 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+