Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC U19 worldcup : 16 పరుగులకే ఆలౌట్.. 10 బంతుల్లోనే మ్యాచ్ పూర్తి

అండర్‌ 19 మహిళల టీ20 ప్రపంచ కప్‌-2025 మ్యాచులు రసవత్తరంగా సాగడం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో సంచలనం నమోదైంది. సౌతాఫ్రికా జట్టు కేవలం 10 బంతుల్లోనే మ్యాచ్‌ ముగించేసి విజయం సాధించింది.

తాజాగా గ్రూప్‌ సిలో భాగంగా సమోవా - సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లోనే దక్షిణాఫ్రికా ఘనత సాధించింది. ఈ పోరులో మొదట బ్యాటింగ్‌ కు దిగిన సమోవా 9.1 ఓవర్లలోనే 16 పరుగుల చేసి కుప్పకూలింది. సమోవా ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కావడం గమనార్హం. నలుగురు బ్యాటర్లు కేవలం ఒక్కొక్క పరుగు మాత్రమే చేయగా.. ఇద్దరు బ్యాటర్లు చెరో మూడు పరుగులు చేశారు. ఎక్స్‌ట్రాల రూపంలో మరో 6 పరుగులు వచ్చాయి. సౌతాఫ్రికా బౌలర్లలో ఎన్‌తబిసెంగ్‌ నిని 3, ఫే కౌలింగ్ , కేలా రేనెకె, శేషిని నాయుడు తలో 2 వికెట్లు దక్కించుకున్నారు. సమోవా బ్యాటర్లు చేసిన పరుగుల కన్నా దక్షిణాఫ్రికా బౌలర్లు పడగొట్టిన వికెట్ల సంఖ్య (అంకెల్లో) టాప్‌గా ఉన్నాయి.

ICC U-19 World Cup 2025 south africa defeat Samoa match completed in 10 Balls Dismissed For 16 All Out

అనంతరం స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా ఓపెనర్లే 10 బంతుల్లో 17 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు సిమోన్‌ లారెన్స్‌ (6 నాటౌట్‌), జెమ్మా బోతా (6 నాటౌట్‌).. వీరిద్దరు కలిసి 1.4 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు.

అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో పసికూన నైజీరియా.. అగ్రజట్టు న్యూజిలాండ్‌కు గట్టి షాకిచ్చింది. న్యూజిలాండ్‌పై జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్ లో నైజీరియా 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Story first published: Tuesday, January 21, 2025, 9:59 [IST]
Other articles published on Jan 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+