Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ద్రవిడ్ సార్ ఓ లెజెండ్: అందరికీ కృతజ్ఞతలు తెలిపిన పృథ్వీ షా

ICC U-19 World Cup 2018: Prithvi Shaw lauds Rahul Dravid

హైదరాబాద్: ఓ గొప్ప జట్టుకు సారథ్య బాధ్యతలు వహించడం గొప్ప అనుభూతని అని అండర్-19 జట్టు కెప్టెన్ పృథ్వీ షా పేర్కొన్నాడు. న్యూజిలాండ్ వేదికగా పృథ్వీ షా నేతృత్వంలోని భారత యువ జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో వరల్డ్ కప్‌ని నెగ్గిన సంగతి తెలిసిందే.

తద్వారా గతంలో ఏ జట్టు సాధించలేని విధంగా నాలుగో సారి వరల్డ్ కప్‌ని నెగ్గిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన రెండు రోజుల తర్వాత కెప్టెన్ పృథ్వీ షా సోషల్ మీడియా వేదికగా అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో క్రికెట్ అభిమానులకు కృతజ్ఞతలు చెప్పుకొచ్చాడు. టీమిండియాతో పాటు దేశవ్యాప్తంగా తమకు పూర్తి మద్దతు లభించిందని అందులో పేర్కొన్నాడు. ఓ గొప్ప జట్టుకు సారథ్య బాధ్యతలు వహించడం గొప్ప అనుభూతని అన్నాడు.

జట్టు తనకు కుటుంబ సభ్యలు కంటే ఎక్కువని పేర్కొన్న షా వారి సహకారం లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదని అన్నాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్ గురించి చెబుతూ ఆయనో 'లెజెండ్' అని పేర్కొన్నాడు. విజయం కోసం ఆయన పడిన కష్టం మాటల్లో వర్ణించలేదని చెప్పాడు.

జట్టు విజయాల కోసం తెరవెనక కృషి చేసిన వారిని కూడా మర్చిపోలేమని అన్నాడు. ఆత్మగౌరవం, జట్టు సమిష్టి కృష్టి వల్లే ఇది సాధ్యమైందని తెలిపాడు. న్యూజిలాండ్ వేదికగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన పైనల్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, February 5, 2018, 17:46 [IST]
Other articles published on Feb 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+