Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లో సంచలనం: ఎవరీ షహీన్‌ అఫ్రిది

ICC U-19 World Cup 2018: Meet Shaheen Afridi, the latest to emerge from Pakistan's conveyor belt of fast bowlers

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో ఫాస్ట్ బౌలింగ్ టాలెంట్‌ ఉన్న క్రికెటర్లను ప్రోత్సహించడంలో పాకిస్థాన్ జట్టు ఎప్పుడూ ముందుంటుంది. అంతేకాదు ప్రపంచంలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లు కలిగిన జట్టులో పాకిస్థాన్ ఒకటి. అప్పటి ఇమ్రాన్ ఖాన్ నుంచి ఇప్పటి ఆమీర్ వరకు ఎంతో మంది ఫాస్ట్ బౌలర్లను మనం చూశాం.

తాజాగా న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న అండర్‌-19 వరల్డ్ కప్‌లో తన బౌలింగ్‌తో ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు యువ ఫాస్ట్ బౌలర్ షహీన్‌ అఫ్రిది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6/15తో తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. అంతేకాదు షహీన్ బౌలింగ్ శైలి అచ్చం ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌ను పోలి ఉంటుంది.

ఈ మేరకు సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. తాజాగా షహీన్ ఓ ఇంటర్యూలో తాను సల్మాన్‌ ఖాన్‌కు వీరాభిమాని అని చెప్పడం విశేషం. అంతేకాదు తాను బాలీవుడ్‌ సినిమాలన్ని చూస్తానని, ఇటీవలే సల్మాన్‌ఖాన్‌ నటించిన టైగర్‌ జిందా హై సినిమా చూశానని చెప్పుకొచ్చాడు.

తనకు హిందీ కూడా వచ్చని తెలిపాడు. ఆ తర్వాత 'ఇంగ్లీష్‌లో ఇంటర్వ్యూ ఇవ్వడం ఇది రెండోసారి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అందుకున్నప్పుడు మొదటిసారి ఇంగ్లీష్‌లో మాట్లాడాను. ఈ మధ్య నన్ను ఆసీస్‌ బౌలర్‌ స్టార్క్‌తో పోల్చుతున్నారు. ఇలాంటి పోలికలు గురించి నేను ఇప్పుడే ఏమీ ఆలోచించను. నాలానే బౌలింగ్‌ వేస్తాను' అని చెప్పాడు.

Story first published: Saturday, January 20, 2018, 17:57 [IST]
Other articles published on Jan 20, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+