For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ U-19 వరల్డ్ కప్: పాక్‌పై గెలిస్తేనే భారత్ ఫైనల్‌కు, స్టేడియం హౌస్‌పుల్

By Nageshwara Rao
ICC U-19 World Cup 2018: India take on Pakistan with an eye on final

హైదరాబాద్: న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో భారత్ మంగళవారం తలపడనుంది. టోర్నీలో భాగంగా క్రైస్ట్ చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ మైదానంలో రెండో సెమీ ఫైనల్లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.

ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి పైనల్‌కు అర్హత సాధించాలని భారత క్రికెట్ అభిమానులందరూ కోరుకుంటున్నారు. సెమీస్‌లో పాక్‌పై విజయం సాధించాలని భారత జట్టు ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.

ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్‌ మూడు సార్లు వరల్డ్ కప్ గెలవగా పాకిస్థాన్ రెండు సార్లు కైవసం చేసుకుంది. దాయాది దేశాలు కావడంతో పోరుపై అమితాసక్తి ఏర్పడింది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కి అమ్ముడైన టికెట్ల సంఖ్య ఈవిషయాన్ని తెలియజేస్తుంది. స్టేడియం కెపాసిటీ మొత్తం అమ్ముడయ్యాయని, అభిమానుల నుంచి వచ్చే డిమాండ్‌ను బట్టి అదనపు స్టాండ్ ఏర్పాటు చేస్తామని స్టేడియం నిర్వాహకులు తెలిపారు.

ICC U-19 World Cup 2018: India take on Pakistan with an eye on final

సెమీస్‌ మ్యాచ్ జరిగే హెగ్లే ఓవల్‌ మైదానంలో పరిస్థితులు పాకిస్థాన్‌కు బాగా తెలుసు. క్వార్టర్స్‌లో ఆ జట్టు ఇక్కడే ఆడింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న యువ క్రికెటర్లు బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో కోట్లు పలికారు.

ఎడమచేతి వాటం పేసర్‌ నాగర్‌కోటిని రూ.3.2 కోట్లు, మరో బౌలర్‌ శివమ్‌ మావిని రూ.3 కోట్లు, శుభ్‌మాన్‌ గిల్‌ను రూ. 1.8 కోట్లు పెట్టి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కొనుగోలు చేసింది. ఇక, అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఉన్న పృథ్వీషాను రూ. 1.2 కోట్లు, ఎడమచేతి వాటం స్పిన్నర్‌ అనుకుల్‌ రాయ్‌ను రూ.20 లక్షలకు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టు కొనుగోలు చేసింది.

అభిషేక్‌ శర్మను రూ.55 లక్షలు పెట్టి ముంబై కొనుగోలు చేశాయి. పృథ్వీషాతో ఓపెనింగ్‌కు దిగే మన్‌జ్యోత్‌ను కనీస ధర రూ.20 లక్షలకు ఢిల్లీనే సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకోవాలని శుభమాన్‌ గిల్‌ అన్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుతో ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

ICC U-19 World Cup 2018: India take on Pakistan with an eye on final

జట్ల వివరాలు:
భారత్‌: పృథ్వీషా (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్‌, ఆర్యన్‌ జుయల్‌, అభిషేక్‌ శర్మ, అర్షదీప్‌ సింగ్‌, హార్విక్‌ దేశాయ్‌, మన్‌జ్యోత్‌ కార్ల, కమలేశ్‌ నాగర్‌కోటి, పంకజ్‌ యాదవ్‌, రియాన్‌ పరాగ్‌, ఇషాన్‌ పోరెల్‌, హిమాన్షు రాణా, అంకుల్‌ రాయ్‌, శివమ్‌ మావి, శివ సింగ్‌

పాకిస్థాన్: హసన్‌ ఖాన్‌ (కెప్టెన్), రొహైల్‌ నజీర్‌, మహ్మద్‌ అలీ ఖాన్‌, అలీ జర్యబ్‌, అమ్మద్‌ ఆలమ్‌, అర్హద్‌ ఇక్బాల్‌, ఇమ్రాన్‌ షా, మహ్మద్‌ తహా, మోషిన్‌ ఖాన్‌, మహ్మద్‌ ముసా, మహ్మద్‌ జైద్‌, మునీర్‌ రియాజ్‌, షాహీన్‌ అఫ్రిది, సులేమాన్‌

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 30, 2018, 9:22 [IST]
Other articles published on Jan 30, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+