అండర్ 19లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్ జట్టు

హైదరాబాద్: ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్‌కు ఎదురులేకుండా దూసుకెళ్లింది. భారత్ జట్టు టోర్నీలో భాగంగా క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ పృథ్వీ షా(40), శుభ్నమ్ గిల్(86), అభిషేక్ శర్మ(50) బ్యాటింగ్‌లో రాణించడంలో భారత జట్టు గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది.
మిగతా ఆటగాళ్లు ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఐదుగురు ఆటగాళ్లు రెండంకెల స్కోరు కూడా చేయలేకపోవడం గమనార్హం. బంగ్లా బౌలర్లు క్వాజి ఒనిక్(3), నయీమ్ హాసన్(2), సైఫ్ హాసన్(2) ధాటికి భారత్ 49.2 పరుగులకు ఆలౌటై 265 పరుగులు చేసింది.
266 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మొదటి నుంచి తడబడుతూనే ఉంది. భారత్ బౌలర్లు నాగర్ కోటి(3), శివమ్ మావి(2), అభిషేక్ వర్మ(2) రాణించడంతో ఆ జట్టు 42.1 ఓవర్లలో 134 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో భారత్ 131 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఈ నెల 30న జరగనున్న సెమీఫైనల్-2లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడనుంది. ఈ నెల 29న జరగనున్న సెమీఫైనల్-1లో ఆస్ట్రేలియా-అఫ్గానిస్థాన్ మధ్య విజేత ఎవరో తేలనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications