కపిల్ దరిదాపుల్లోకి కూడా పాండ్యా రాలేడు: కర్సన్ గ్రావి

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జరిగిన తొలి కేప్ టౌన్ టెస్టులో వరుసగా వికెట్లు పడిపోతున్న సమయంలో మైదానంలో ఒక్కడే నిలబడి స్కోరును పరిగెత్తించాడు. తొలి టెస్టులో జరిగిన రెండు ఇన్నింగ్స్ లో కలిపి నాలుగు వికెట్లు తీశాడు. మొదటి ఇన్నింగ్స్ లో చేసిన 93పరుగులతో కలిపి అతనిపై ఇప్పుడు విశ్లేషణ మొదలైంది.
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్‌కు దరిదాపుల్లో కూడా లేడని టీమ్‌ఇండియా మాజీ పేసర్ కర్సన్ గావ్రి అన్నాడు.
''కపిల్ కంటే పాండ్య మెరుగైన ఆల్‌రౌండర్ అని పత్రికల్లో చదివా. నా అభిప్రాయం ప్రకారం పాండ్య.. కపిల్ దరిదాపుల్లో కూడా లేడు. ఒకవేళ కపిల్‌ను అందుకోవాలన్నా పాండ్య చాలా దూరం ప్రయాణించాలి. అసలు పోలికే సరికాదు. కపిల్ ఘనతల్ని పాండ్య ఏమేరకు అందుకుంటాడన్నది కాలమే చెప్తుంది'' అని గావ్రి తెలిపాడు.
'మేము ఇంకా రెండు, మూడు టెస్టుల్లో మా ప్రతిభను మెరుగుపరుచుకోవాల్సి ఉంది. దీని కోసం మా జట్టులోని బ్యాట్స్ మెన్ లు సైతం ఇంకా కష్టపడాల్సి ఉంది. ఈ రెండు టెస్ట్ ల్లోనూ మా ప్రతిభను మెరుగుపరుచుకొని జట్టును విజయవంతంగా నడిపిస్తాం' అని గావ్రి వివరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications