Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ U-19 వరల్డ్ కప్: ఫైనల్‌కు చేరిన ఆస్ట్రేలియా

 ICC U-19 World Cup 2018: Australia storm into final

హైదరాబాద్: న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లోకి ప్రవేశించిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. సోమవారం జరిగిన తొలి సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

ఆస్ట్రేలియా బౌలర్ జొనథన్ మెర్లో దెబ్బకు ఆప్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్‌కు చేరారు. ఇక్రం అలీ (80) తప్ప ఆ జట్టులో మిగతా ఆటగాళ్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. ఏడుగురు ఆప్ఘనిస్థాన్ ప్లేయర్లు రెండంకెల స్కోరు చేయలేకపోయారు. దీంతో ఆ జట్టు 48 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది.

అనంతరం 182 పరుగుల విజయలక్ష్యంలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా అలవోక విజయాన్ని సాధించింది. ఆసీస్ఓపెనర్‌ ఎడ్వర్ట్స్‌ (72) రాణించడంతో 37.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా లక్ష్యాన్ని చేధించింది. రెండో సెమీ ఫైనల్లో భాగంగా మంగళవారం భారత్‌-పాకిస్థాన్‌ జట్లు తలపడనున్నాయి.

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ఫిబ్రవరి 3న జరిగే ఫైనల్లో ఈ జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 29, 2018, 11:09 [IST]
Other articles published on Jan 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+