అండర్-19 వరల్డ్ కప్: అమేజింగ్ ఫీలింగ్, ఛాంపియన్లు ఏమన్నారంటే
హైదరాబాద్: 'ది వాల్' అంటే ఏంటో తెలిసిందని అండర్-19 వరల్డ్ కప్ పైనల్లో టీమిండియా గెలిచిన అనంతరం కెప్టెన్ పృథ్వీ షా వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్ వేదికగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో నాలుగోసారి అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఫైనల్లో మ్యాచ్ విజయానంతరం భారత ఆటగాళ్లు ఆనందం వ్యక్తం చేస్తూ గెలుపు క్రెడిట్ అంతా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు కోచింగ్ స్టాఫ్‌దేనని చెప్పుకొచ్చారు.
కెప్టెన్ పృథ్వీషా మాట్లాడుతూ
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ పృథ్వీషా మాట్లాడుతూ 'ఇప్పడు నా ఫీలింగ్‌ను పంచుకోలేకపోతున్నా. గర్వంగా ఉంది. క్రెడిట్ అంతా మా కోచింగ్ స్టాఫ్‌దే. వారు గత రెండేళ్లుగా మాకు మద్దతుగా నిలిచారు. రాహుల్ సర్ లెజెండ్. ‘ది వాల్' అంటే ఏంటో మాకు తెలిసింది. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆ ఇద్దరు ద్రవిడ్, పరాస్ మాంబ్రేలు గొప్ప సూచనలు చేశారు. ఇవి మా విజయానికి దోహద పడ్డాయి' అని పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియా కెప్టెన్ జాసన్ సంఘా మాట్లాడుతూ
ఆస్ట్రేలియా కెప్టెన్ జాసన్ సంఘా మాట్లాడుతూ 'ఏమి మాట్లాడాలో తెలియడం లేదు. మా ఆటగాళ్లు ప్రదర్శన పట్ల గర్వంగా ఫీలవుతున్నా. అయితే, పూర్తి క్రెడిట్ మాత్రం భారత్‌దే. వారు చాలా అద్భుతంగా ఆడారు. ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లకు బెస్ట్ ఆఫ్ లక్. ఈ రోజు మా ఆటగాళ్ల ప్రయత్నం అద్భుతం. కెప్టెన్‌గా ఎవరిని నిందించలేను. వారంతా 110 శాతం రాణించారు. మా కంటే భారత్ బాగా ఆడింది. ఈ రోజు వారికి లభించిన మద్దతు బాగుంది. ఈ రోజు మైదానానికి అధిక సంఖ్యలో ప్రేక్షకులు రావడం చూస్తే అద్భుతమనిపించింది' అని అన్నాడు.
శుభ్‌మాన్ గిల్ మాట్లాడుతూ
అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డు అందుకున్న శుభ్‌మాన్ గిల్ మాట్లాడుతూ 'మా జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఫీలవుతున్నా. రాహుల్ సర్ కోచ్ ఉండటమే మా అదృష్టం. కేవలం మైదానంలో మీ ఆటనే ఆడండి అని రాహుల్ సర్ చెప్పాడు. మేం అదే చేశాం. ఇక్కడి పరిస్థితులు కలిసొచ్చాయి. ఈ విజయం నాకు చాలా ఉత్సహన్నిచ్చింది. ఇదే ఊపుతో ఐపీఎల్‌లో రాణిస్తాను' అని అన్నాడు.
మన్‌జోత్ కల్రా మాట్లాడుతూ
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న మన్‌జోత్ కల్రా మాట్లాడుతూ 'ఇదో గొప్ప అనుభూతి. ఇక్కడి పరిస్థితులు మాకు కలిసొచ్చాయి. ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నా. బ్యాటింగ్‌కు అనువైన పిచ్' అని అన్నాడు.
ఇషాన్ పోరేల్ మాట్లాడుతూ
టీమిండియా బౌలర్ ఇషాన్ పోరేల్ మాట్లాడుతూ 'మా గెలుపు క్రెడిట్ కోచింగ్ స్టాఫ్‌దే. ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ అని ఫీలవుతున్నా. ఇదో గొప్ప పోటీ. భారత్ నుంచి చాలా మెసేజ్‌లు వచ్చాయి. కొన్ని కారణాలవల్ల వారందరికీ రిప్లే ఇవ్వలేకపోయా. అందరికి ధన్యావాదాలు. టోర్నీ ఆసాంతం మా బౌలర్లు అద్బుతంగా రాణించారని చెప్పగలను. ఇది సమిష్టి ప్రదర్శన' అని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications