202 పరుగుల ఆధిక్యంతో అండర్ 19లో సంచలన విజేతగా అప్గనిస్థాన్

హైదరాబాద్: అండర్-19 ప్రపంచకప్‌లో గురువారం పెను సంచలనం నమోదైంది. క్వార్టర్ ఫైనల్లో ఆతిథ్య న్యూజిలాండ్‌పై అప్గనిస్థాన్ భారీ విజయాన్ని నమోదు చేసింది. అప్గనిస్థాన్ దూకుడుతో న్యూజిలాండ్ యువజట్టు ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. అప్గనిస్థాన్ విజయం టాస్ గెలిచుకోవడంతోనే మొదలైంది.
తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బాజ్(69), జర్డాన్(68) జట్టుకు శుభారంభం ఇచ్చారు. అనంతరం బహీర్ షా(67 నాటౌట్)గా నిలిచారు.
అజ్మతుల్లా(66; 23 బంతుల్లో) ధాటికి అఫ్గానిస్థాన్ భారీ స్కోరు సాధించింది. 310 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు ఆరంభం నుంచే తడబడింది.
అఫ్గాన్ బౌలర్లు ముజీబ్, అహ్మద్ ధాటికి కివీస్ బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. దీంతో 28.1ఓవర్లలో కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. దీంతో అఫ్గాన్ 202 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. టోర్నీలో భాగంగా భారత్ శుక్రవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications