Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అండర్-19 వరల్డ్ కప్: ద్రవిడ్ కోచింగ్, ఛాంపియన్ జట్టులా ఆడిన భారత్

హైదరాబాద్: నాలుగోసారి అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత యువ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. గ‌తంలో ఎవ‌రికీ సాధ్యం కాని రీతిలో అండ‌ర్-19 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను నాలుగోసారి గెలిచి పృథ్వీ షా నేతృత్వంలోని యువ భారత జట్టు చరిత్ర సృష్టించింది. మౌంట్ మాంగన్యూ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.

Under-19 World Cup : India Lift record fourth U-19 World Cup title

ఐదు మ్యాచ్‌ల్లో విజయం

ఆస్ట్రేలియా నిర్దేశించిన 217 ప‌రుగుల విజయ ల‌క్ష్యాన్ని కేవ‌లం 38.5 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు కోల్పోయి భారత్ చేధించింది. టోర్నీలో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా పైనల్లో కూడా అదే జోరుని కొనసాగించింది. బౌలింగ్‌, ఫీల్డింగ్‌, బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసి నాలుగోసారి విశ్వ విజేతగా నిలిచింది.

ఓపెన‌ర్ మ‌న్‌జోత్ క‌ల్రా సెంచరీ

ఓపెన‌ర్ మ‌న్‌జోత్ క‌ల్రా సెంచరీ

ఓపెన‌ర్ మ‌న్‌జోత్ క‌ల్రా (101 నాటౌట్‌) సెంచ‌రీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ఇదే ఆస్ట్రేలియాపై వంద ప‌రుగుల‌తో గెలిచిన టీమిండియా ఫైన‌ల్లో కూడా ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో ఆసీస్‌తో మొదలుకుని ప‌పువా న్యూ గినియా, జింబాబ్వే, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ ఆ తర్వాత మళ్లీ ఆస్ట్రేలియాపై గెలిచింది.

ఛాంపియన్ జట్టులా ఆడిన భారత్

రాహుల్ ద్ర‌విడ్ కోచింగ్‌లో పృథ్వి షా సేన‌ ఓ ఛాంపియన్ జట్టులా ఆడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల దెబ్బకు 47.2 ఓవ‌ర్ల‌లో 216 ప‌రుగుల‌కే ఆలౌటైంది. భారత బౌలర్లలో అనుకుల్ రాయ్, కమలేష్ నాగర్ కోటి, శివ సింగ్, ఇషాన్ పోరేల్ తలో రెండు వికెట్లు తీసుకోగా, శివమ్ మావి ఒక వికెట్ తీశాడు.

82 ప‌రుగుల తేడాలో 7 వికెట్లు

ఒకానోక ద‌శ‌లో 134 ప‌రుగుల‌కే 3 వికెట్ల‌తో ఉన్న ఆసీస్‌.. 82 ప‌రుగుల తేడాలో 7 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా చివ‌రి ప‌ది ఓవ‌ర్ల‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌పై భారత బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లలో మెర్లో మాత్ర‌మే 76 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

నాలుగోసారి విశ్వవిజేతగా భారత్

అంతకముందు 2000, 2008, 2012లలో టీమిండియా అండర్-19 వరల్డ్ కప్ విజేతగా అవతరించింది. 2000లో మహ్మద్ కైఫ్ కెప్టెన్సీలో, 2008లో విరాట్ కోహ్లి కెప్టెన్సీలో, 2012లో ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. 2012లో ఆస్ట్రేలియాపై గెలిచే ట్రోఫీని సొంతం చేసుకున్న టీమిండియా తాజాగా మ‌రోసారి పృథ్వి షా నేతృత్వంలో అదే ఆస్ట్రేలియాపై గెలిచి రికార్డు స్థాయిలో నాలుగోసారి వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను సొంతం చేసుకుంది.

Story first published: Saturday, February 3, 2018, 14:29 [IST]
Other articles published on Feb 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+