Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అండర్ 19 వరల్డ్ కప్ హీరో అనుకుల్ రాయ్‌పై చిన్ననాటి కోచ్

ICC U-19 WC: India spinner Anukul Roy was reluctant to bowl in his early days

హైదరాబాద్: అనుకుల్ రాయ్. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్‌లో వెలుగు చూసిన భారత యువ సంచలనం. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సొంత రాష్ట్రం జార్ఖండ్‌కు చెందినవాడు. అంతేకాదు అచ్చం ధోని లాగే చిన్నప్పుడు అనుకుల్ రాయ్ కూడా టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడాడు.

ఈ విషయాన్ని అనుకుల్ రాయ్ చిన్ననాటి కోచ్ బ్రజేష్ ఝా వెల్లడించాడు. అండర్ 19 వరల్డ్ కప్‌లో భాగంగా పాపువా న్యూ గినియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో అనుకుల్‌ రాయ్‌ భారత జట్ట విజయంలో కీలకపాత్ర పోషించాడు. అనుకుల్ రాయ్‌ దెబ్బకు న్యూగినియా 21.5 ఓవర్లలో 64 పరుగులకే కుప్పకూలింది.

ఈ మ్యాచ్‌లో 6.5 ఓవర్లు వేసిన రాయ్‌ 14 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఇందులో రెండు ఓవర్లు మెయిడెన్‌లు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా బ్రజేష్ ఝా మైఖేల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో అనుకుల్ రాయ్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

'నేను జార్ఖండ్‌లోని క్రికెట్ గ్రౌండ్స్‌లో ఎక్కువగా తిరుగుతుంటాను. ఒకరోజు ఫాస్ట్ బౌలింగ్‌లో అనుకుల్ సిక్సులు బాదడాన్ని నేను గమనించాను. అయితే మ్యాచ్ టెన్నిస్ బాల్‌తో ఆడుతున్నారు. అప్పటికే అనుకుల్ టెన్నిస్ బాల్‌తో ఆడే మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని విన్నాను' అని తెలిపాడు.

'ఎందుకంటే తాను ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ అతడు సెంచరీ చేస్తున్నాడు. ఆ తర్వాత అతడిని సమస్తిపూర్ క్రికెట్ క్లబ్‌కు తీసుకొచ్చాను. ఇక్కడ డ్యూస్ బాల్‌ను ఎదుర్కొనే క్రమంలో అనుకుల్ మొట్టమొదటి సారి ప్యాండ్స్, గ్లౌవ్స్ ధరించాడు' అని చిన్ననాటి కోచ్ బ్రజేష్ ఝా వివరించాడు.

'నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అనుకుల్ వైవిధ్యంతో కూడిన స్పిన్ బౌలింగ్‌ వేయడాన్ని గమనించాను. నెట్‌లో అతడు ఫ్లిప్పర్స్, ఆర్మర్స్‌ను సునాయాసంగా సంధిస్తున్నాడు. అతడి బౌలింగ్‌లో నేను గమనించిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే గాల్లో బంతిని రోల్ చేయడం' అని చెప్పుకొచ్చాడు.

అనుకుల్‌లో స్పిన్ బౌలర్‌ను గుర్తించిన ఝా ఆ తర్వాత అతడిని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్‌కు పంపాడు. అక్కడ స్పిన్ బౌలింగ్‌లో ఎంతో అనుభవం కలిగిన వి వెంకట్రామన్ వద్ద బౌలింగ్‌లో అనుకుల్ మెళకువలను నేర్చుకుని గొప్ప స్పిన్నర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్‌లో సత్తా చాటుతున్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, January 18, 2018, 17:11 [IST]
Other articles published on Jan 18, 2018
Read in English:
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+