
హైదరాబాద్: అండర్-19 ప్రపంచ కప్‌లో భారత్ అజేయంగా దూసుకుపోతోంది. మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన భారత్ రెండో టెస్టులోనూ అదే పంథాను కొనసాగించింది. న్యూజిలాండ్‌లో జరగుతున్న అండర్ -19 ప్రపంచకప్‌లో మరో విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుతున్న పాపువా న్యూ గినియా జట్టును ఈసారి స్పిన్‌తో తిప్పేశారు. అటు బంతితో, ఇటు బ్యాట్‌తో రాణించి మంచి దూకుడును ప్రదర్శించారు.
అండర్-19 భారత జట్టు సారథి అయినటువంటి పృథ్వీ షా నేతృత్వంలోని యువ జట్టు ప్రపంచకప్‌లో మరో సారి విజయాన్ని కైవసం చేసుకుంది. పాపువా న్యూ గినియాతో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి భారత్ పాపువా న్యూ గినియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
భారత స్పిన్నర్ల ధాటికి ప్రత్యర్థి జట్టు చేతులెత్తేసింది. ఆల్‌రౌండర్ అనుకుల్ రాయ్ చేతిలో అతి తక్కువ పరుగులకే విజయాన్ని సాధించింది. కేవలం 21.5 ఓవర్లలో 64పరుగులకే ఆలౌటైంది. 6.5 ఓవర్లు వేసిన రాయ్ తన బౌలింగ్‌తో న్యూగినియాకు ముచ్చెమటలు పట్టించాడు.
కేవలం 14 పరుగులు ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలోవేసుకున్నాడు. ఇందులో రెండు ఓవర్లు మెయిడెన్‌లు కూడా ఉన్నాయి. శివం మవి రెండు వికెట్లు పడగొట్టగా, కమలేశ్ నగర్‌కోటి, అర్షదీప్‌సింగ్ చెరో వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. కెప్టెన్ పృథ్వీ షా అర్ద సెంచరీతో చెలరేగాడు. 39 బంతుల్లో 67 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు. మరో భ్యాట్‌మెన్ మంజోత్ కర్లాలు 9 బంతుల్లో 9 పరుగులు చేసి పృథ్వీ షా కు సహకారం అందించాడు. ఇద్దరు కలిసి విజయానికి కావాల్సిన 65 పరుగులను కేవలం 8 ఓవర్లలోనే సునాయాసంగా విజయాన్ని పొందారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.