For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC Twenty20 World Cup 2020: షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ

ICC T20 World Cup 2020 Schedule | Oneindia Telugu
ICC Twenty20 World Cup 2020: India, Pakistan, Australia to kick off proceedings

హైదరాబాద్: వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగ టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ని మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మహిళల, పురుషుల టీ20 వరల్డ్‌కప్‌ను ఒకే ఏడాది, ఒకే వేదికగా నిర్వహించనుంది.

తొలుత మహిళల టీ20 ప్రపంచకప్‌ జరగనుండగా.. ఆ తర్వాత పురుషుల టీ20 వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. మహిళల వరల్డ్‌కప్ ఫిబ్రవరి 21న ప్రారంభమై మార్చి 8న ముగుస్తుంది. తొలి మ్యాచ్‌లో ఢిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. పురుషుల వరల్డ్‌కప్ అక్టోబర్ 18న ప్రారంభమై నవంబర్ 15న ముగుస్తుంది.

ఆస్ట్రేలియాలోని మొత్తం 13 వేదికల్లో

ఆస్ట్రేలియాలోని మొత్తం 13 వేదికల్లో

ఇక, పురుషుల టోర్నీలో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. మహిళా టోర్నీల్లో 10 జట్లు పోటీపడనుండగా, పురుషుల టోర్నీలో 12 జట్లు పాల్గొననున్నాయి. ఈ రెండు టోర్నీలకు ఆస్ట్రేలియాలోని మొత్తం 13 వేదికలు ఆతిథ్యమివ్వనున్నాయి. రెండు వరల్డ్‌కప్‌ల ఫైనల్ మ్యాచ్‌లు మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి.

అక్టోబర్‌ 24న దక్షిణాఫ్రికాతో కోహ్లీసేన తొలి మ్యాచ్

అక్టోబర్‌ 24న దక్షిణాఫ్రికాతో కోహ్లీసేన తొలి మ్యాచ్

పురుషుల టోర్నీలో టీమిండియా అక్టోబర్‌ 24న దక్షిణాఫ్రికాతో జరిగే తొలి మ్యాచ్‌తో టైటిల్‌ వేటను ప్రారంభించనుంది. ఇరు టోర్నీల్లో ఆయా జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించిన ఐసీసీ మహిళల టోర్నీలో సూపర్‌ 10, పురుషుల టోర్నీ సూపర్‌ 12 పద్దతిలో ఆడించనుంది. పురుషుల టీ20 టోర్నీకి శ్రీలంక, బంగ్లాదేశ్‌లు అర్హత సాధించని సంగతి తెలిసిందే.

క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు కూడా

క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు కూడా

ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లు మరో ఆరు జట్లతో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయి. క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు ఆడే 8 జట్లలో నాలుగు జట్లు టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించనున్నాయి. భారత పురుషుల జట్టు గ్రూప్-2లో ఉంది. ఇందులో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్‌తోపాటు మరో రెండు క్వాలిఫయర్ టీమ్స్ ఉంటాయి.

మహిళల వరల్డ్‌కప్ (ఫిబ్రవరి 21 -మార్చి 3)

గ్రూప్ ఎ: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా, శ్రీలంక, క్వాలిఫయర్1

గ్రూప్ బి: ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, పాకిస్థాన్, క్వాలిఫయర్ 2

సెమీఫైనల్స్: మార్చి 5

ఫైనల్ : మార్చి 8

పురుషుల వరల్డ్‌కప్ (అక్టోబర్ 18 - నవంబర్ 15)

గ్రూప్ స్టేజ్: అక్టోబర్ 18-23

గ్రూప్ 1: పాకిస్థాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్, రెండు క్వాలిఫయర్స్

గ్రూప్ 2: ఇండియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, రెండు క్వాలిఫయర్స్

సెమీఫైనల్స్: నవంబర్ 11, 12

ఫైనల్: నవంబర్ 15

Story first published: Tuesday, January 29, 2019, 13:05 [IST]
Other articles published on Jan 29, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+