For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్‌ పేరు పలకడంలో పొరబడ్డ ట్రంప్‌.. ట్రోల్ చేసిన ఐసీసీ, పీటర్సన్‌!!

ICC trolls Trump with hilarious video for saying Soochin Tendulkar
ICC Hilariously Trolls Trump For Pronouncing Sachin Tendulkar As Soochin Tendulkar | Oneindia Telugu

అహ్మదాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం ప్రత్యేక విమానంలో కుటుంబ సమేతంగా అహ్మదాబాద్‌ చేరుకున్నారు. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారత ప్రధాని నరేంద్ర మోడీ వారికి స్వయంగా రెడ్‌ కార్పెట్ స్వాగతం పలికారు. ఆపై ట్రంప్‌, మోడీ ఎయిర్‌పోర్టు నుంచి ప్రపంచంలోనే అతిపెద్దదైన మోతేరా స్టేడియంకు చేరుకొని అక్కడ ప్రసంగించారు.

ట్రంప్‌ ప్రసంగంలో క్రికెట్‌ ప్రస్తావన

ట్రంప్‌ ప్రసంగంలో క్రికెట్‌ ప్రస్తావన

మోతెరా క్రికెట్‌ మైదానంలో నిర్వహించిన 'నమస్తే ట్రంప్‌' కార్యక్రమంలో మొదటగా మోడీ ప్రసంగించగా.. ఆపై డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ప్రసంగిస్తూ భారత దేశ విశిష్టతను కొనియాడారు. అలాగే భారత దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లీ పేర్లను కూడా ప్రస్తావించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మేటి ఆటగాళ్లైన సచిన్‌, కోహ్లీ భారతీయులేనని, గొప్ప క్రికెటర్లను భారత్‌ అందించిందని ప్రశంసించారు.

'సొ-చిన్‌' టెండూల్కర్‌

'సొ-చిన్‌' టెండూల్కర్‌

అయితే అధ్యక్షుడు ట్రంప్‌.. సచిన్‌, కోహ్లీ పేర్లను తన ప్రసంగంలో ప్రస్తావించినప్పుడు ఉచ్ఛారణలో పొరబడ్డారు. సచిన్‌ టెండూల్కర్‌కు బదులుగా 'సొ-చిన్‌' టెండూల్కర్‌ అని, విరాట్‌ కోహ్లీకి బదులు 'విరాట్‌ కోలీ' అని పలికారు. దీంతో పలువురు నెటిజెన్లు ట్రంప్‌ ఉచ్ఛారణను ఉద్దేశించి ట్రోలింగ్‌ చేశారు. నెట్టింట్లో జోక్‌ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ కెవిన్‌ పీటర్సన్‌, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా ట్రంప్‌ను ఆదుకున్నారు.

ట్రంప్‌ రీసెర్చ్‌ చేయాలి

ట్రంప్‌ రీసెర్చ్‌ చేయాలి

'ట్రంప్‌.. సచిన్‌ పేరును ఉచ్ఛరించడం చూస్తే అతను క్రికెట్‌ అభిమాని కాదనే అభిప్రాయం కలుగుతుంది' అని ఓ నెటిజెన్‌ ట్వీట్‌ చేసాడు. నెటిజెన్‌ ట్వీట్‌కు పీటర్సన్‌ రీట్వీట్‌ చేశాడు. 'సచిన్‌ లాంటి దిగ్గజాల పేర్లు పలికేముందు ట్రంప్‌ తగిన రీసెర్చ్‌ చేయాలి' అని ప్రముఖ ఇంగ్లీష్‌ వ్యాఖ్యాత పీర్స్‌ మెర్గాన్‌కు సూచించాడు.

ట్రంప్‌ను ట్రోల్‌ చేసిన ఐసీసీ

అంతకుముందు ఐసీసీ కూడా ఉచ్ఛారణలో పొరబడ్డ ట్రంప్‌ను ట్రోల్‌ చేసింది. సచిన్‌ పేరును ప్రస్తావిస్తూ.. 'Sach, Such, Satch, Sutch, Sooch' లాంటి పేర్లు ఎవరికైనా తెలుసా? అని ఐసీసీ అభిమానులను ప్రశ్నించింది. కంటెంట్ హోమ్ పేజీలో కూడా పేరు చేంజ్ చేసి సేవ్ చేసింది. ఐసీసీ ట్వీట్‌కు పలువురు ఫాన్స్ 'తెలియదు' అని రిప్లై ఇస్తున్నారు.

Story first published: Tuesday, February 25, 2020, 11:49 [IST]
Other articles published on Feb 25, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+