న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నోబాల్‌ నిర్ణయం థర్డ్‌ అంపైర్‌దే.. టీ20 ప్రపంచకప్‌లోనూ కొనసాగింపు!!

Women's T20 World Cup: ICC To Use Front Foot No-Ball Technology
ICC to use no-ball tecnhnology during the Womens T20 World Cup in Australia

దుబాయ్‌: ఆస్ట్రేలియాలో త్వరలో జరిగే మహిళల టీ20 ప్రపంచకప్‌లో థర్డ్‌ అంపైర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. బౌలర్లు గీతదాటి వేసిన నోబాల్స్‌ను ప్రకటించే అధికారాన్ని థర్డ్‌ అంపైర్‌కు ఇచ్చినట్టు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్‌పై థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం తీసుకొనే విధానాన్ని తొలిసారి ఐసీసీ ఈవెంట్‌లో కూడా అమలు చేయనున్నారు.

ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ శుభారంభం.. క్వార్టర్‌ బెర్త్‌ ఖాయంఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ శుభారంభం.. క్వార్టర్‌ బెర్త్‌ ఖాయం

ప్రతీ బంతిని టీవీ అంపైర్‌ పరిశీలిస్తాడు:

ప్రతీ బంతిని టీవీ అంపైర్‌ పరిశీలిస్తాడు:

ఆస్ట్రేలియాలో జరిగే మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్‌ను థర్డ్‌ అంపైర్‌ పర్యవేక్షిస్తాడని ఐసీసీ మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. 'ప్రతీ బంతిని టీవీ అంపైర్‌ (థర్డ్‌ అంపైర్‌) పరిశీలిస్తాడు. నోబాల్‌ అయితే వెంటనే ఫీల్డ్‌ అంపైర్‌కు సమాచారం అందిస్తాడు. ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్‌ విషయంలో ఫీల్డ్‌ అంపైర్‌ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించాం' అని క్రికెట్ ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అలార్డైస్ పేర్కొన్నారు.

13 నోబాల్స్ గుర్తింపు:

13 నోబాల్స్ గుర్తింపు:

గతేడాది చివరలో భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లలో థర్డ్‌ అంపైర్‌కు ప్రయోగాత్మకంగా నోబాల్స్‌ బాధ్యతను అప్పగించి పరిశీలించిన ఐసీసీ.. మహిళల మెగా టోర్నీలో పూర్తిస్థాయిలో థర్డ్‌ అంపైర్‌కే నిర్ణయాధికారం వదిలేసింది. ఇటీవల జరిగిన 12 మ్యాచ్‌ల్లో బౌలర్లు 4,717 బంతులు సంధించగా.. గీత దాటిన 13 నోబాల్‌లను థర్డ్‌ అంపైర్‌ గుర్తించారు. ఇందులో కచ్చితమైన నిర్ణయాలు రావడంతో ఐసీసీ మెగా ఈవెంట్‌లో థర్డ్‌ అంపైర్‌కే ఆ బాధ్యతలు అప్పజెప్పింది.

2016లోనే మొదలు:

2016లోనే మొదలు:

2016లో ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన సిరీస్‌లో దీన్ని అమలు చేసినా.. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా నిలిపివేసారు. అయితే మరోసారి ఈ పద్దతిని భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లలో ప్రయోగించింది. ఐసీసీ నిర్ణయంతో అన్‌ఫీల్డ్ అంపైర్ల పని మరింత సులువయింది. ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌ ఈ నెల 21న మొదలవుతుంది. సిడ్నీలో జరిగే తొలి మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడతాయి.

Story first published: Wednesday, February 12, 2020, 8:54 [IST]
Other articles published on Feb 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X