For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ కీలక నిర్ణయం.. వరల్డ్ కప్‌ను ఇంగ్లండ్‌కు మార్చాలని యోచన!

వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ వేదిక మారే అవకాశం కనిపిస్తోంది. ఈ మెగా టోర్నీకి యూఎస్ఏ, వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఇక్కడ క్రికెట్ మైదానాల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదని, ఐసీసీ ప్రమాణాలకు తగ్గట్లు లేదని తెలుస్తోంది. అందుకే ఈ వేదికను మార్చే పరిస్థితి కనిపిస్తోంది.

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వేదికను ఇంగ్లండ్‌కు మార్చాలని ఐసీసీ భావిస్తోందట. ఎందుకంటే ఈ వరల్డ్ కప్‌ మరో 12 నెలల్లోనే ఉంది. ఆలోపు అమెరికాలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్చడం అంత ఈజీకాదు. అందుకే ఈ టోర్నీని నిర్వహించాలని ఇంగ్లండ్‌ను రిక్వెస్ట్ చేయాలని ఐసీసీ అనుకుంటోంది. గతంలో ఐసీసీ ప్రకటన ప్రకారం 2030 టీ20 వరల్డ్ కప్ ఇక్కడ జరగాల్సి ఉంది.

 2024 T20 World Cup

ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా వచ్చే వరల్డ్ కప్‌ను ఇంగ్లండ్‌లో నిర్వహించి, 2030లో టోర్నీని అమెరికాలో ఏర్పాటు చేయాలని ఐసీసీ ప్లాన్ చేస్తోందట. ఇలా చేయడం వల్ల ఐసీసీ ఈవెంట్ నిర్వహించే స్థాయికి యూఎస్ఏ స్టేడియాల్లో వసతులు అందుబాటులోకి వస్తాయని భావిస్తోంది. 'యూఎస్ఏలో వసతులు ఏమంత బాగలేవు. అందుకే 2024, 2030 వేదికలను స్వాప్ చేయాలని ఐసీసీ అనుకుంటోంది. లేదంటే మరీ ఇంత తొందరగా వసతులు ఏర్పాటు చేయడం జరగదు' అని ఐసీసీకి సంబంధించిన వాళ్లు చెప్తున్నారు.

 2024 T20 World Cup

ప్రస్తుతం యూఎస్ఏలో కేవలం రెండు స్టేడియాల్లో మాత్రమే అంతర్జాతీయ స్థాయి వసతులు ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజనల్ పార్క్ ఒకటి కాగా.. టెక్సాస్‌లోని మూసా స్టేడియం రెండోది. ఇప్పటి వరకు అసోసియేట్ దేశాలు ఆడిన 12 వన్డేలకు మూసా స్టేడియం వేదికగా నిలిచింది. ఇక సెంట్రల్ బ్రోవార్డ్ రీజనల్ పార్క్‌లో ఇండియా, వెస్టిండీస్, న్యూజిల్యాండ్, శ్రీలంక తదితర దేశాలు పాల్గొన్న 14 టీ20లకు ఆతిథ్యం ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ కోసం మరిన్ని స్టేడియాలను అభివృద్ధి చేయాల్సి ఉంది.

Story first published: Monday, June 5, 2023, 17:03 [IST]
Other articles published on Jun 5, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+