Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌.. 'టాప్‌'లోనే విరాట్‌ కోహ్లీ!!

ICC Test rankings: Virat Kohli stays on top, Marnus Labuschagne moves to number 3

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ తన అగ్ర స్థానాన్నినిలబెట్టుకున్నాడు. కోహ్లీ 928 రేటింగ్‌ పాయింట్లతో నంబర్‌వన్‌ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ 911 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. స్మిత్‌ కన్నా కోహ్లీ 17 పాయింట్ల ముందంజలో ఉన్నాడు.

మూడో స్థానంలో లబుషేన్‌:

మూడో స్థానంలో లబుషేన్‌:

సూపర్ ఫామ్‌లో ఉన్న ఆసీస్‌ యువ బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబ్‌షేన్‌ (827) తొలిసారిగా మూడో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో 549 పరుగులు చేయడంతో ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ పదో స్థానానికి చేరాడు. చతేశ్వర్‌ పుజార (791) ఓ స్థానాన్ని కోల్పోయి ఆరో ర్యాంకుకు పడిపోగా.. భారత టెస్టు వైస్‌కెప్టెన్‌ అంజిక్య రహానే (759) రెండు స్థానాలు దిగజారి తొమ్మిదో స్థానంలో నిలిచాడు.

బుమ్రా @ 6:

బుమ్రా @ 6:

బౌలింగ్‌ విభాగంలో టీమిండియా పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా (794) ఆరో ర్యాంకులో కొనసాగగా.. స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (772), సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ వరుసగా 9, 10వ స్థానాల్లో ఉన్నారు. ఆసీస్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ (904) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కివీస్‌ పేసర్‌ వాగ్నర్‌ (852), విండీస్‌ సీనియర్‌ జేసన్‌ హోల్డర్‌ (830) తర్వాతి ర్యాంకుల్లో ఉన్నారు. మిచెల్‌ స్టార్క్‌(796) మార్చి 2018 తర్వాత మరోసారి తన కెరీర్‌ అత్యుత్తమ ఐదో ర్యాంకుకు చేరుకున్నాడు.

అగ్రస్థానంలో టీమిండియా:

అగ్రస్థానంలో టీమిండియా:

ఆల్‌రౌండర్‌ విభాగంలో టీమిండియా స్టార్‌ రవీంద్ర జడేజా రెండో ర్యాంకులో కొనసాగగా.. హోల్డర్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. టీం ర్యాంకింగ్స్‌లో టీమిండియా 120 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా (108), న్యూజీలాండ్ (105), సౌతాఫ్రికా (102), ఇంగ్లాండ్ (102) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

కోహ్లీ@ 1000:

కోహ్లీ@ 1000:

విరాట్‌ కోహ్లీ కొత్త ఏడాదిలో మరో మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ టీ20ల్లో కెప్టెన్‌గా వేయి పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. వేగంగా (30 ఇన్నింగ్స్‌లు) ఈ ఫీట్‌ను చేరుకున్న కెప్టెన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (62 మ్యాచ్‌ల్లో 1112) రికార్డును అధిగమించాడు. ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక పరుగుల జాబితాలో రోహిత్‌ శర్మను దాటేస్తూ టాప్‌లోకి దూసుకొచ్చాడు.

Story first published: Thursday, January 9, 2020, 9:44 [IST]
Other articles published on Jan 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+